For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Prithvi Shaw : సెల్ఫీ ఇవ్వలేదని.. కారు వెంటపడి దాడి చేసిన దుండగులు!

Mob destroy car targeting Prithvi Shaw for refusing selfie

సెలెబ్రిటీలు ఎక్కడకు వెళ్లినా సెల్ఫీలు, ఆటోగ్రాఫులు అంటూ చాలా మంది వాళ్లను ఇబ్బంది పెడుతుంటారు. చాలా సందర్భాల్లో సదరు సెలెబ్రిటీలు అభిమానుల కోసం తమ ఇబ్బందిని పక్కన పెట్టి సెల్ఫీలు ఇస్తుంటారు. కొన్నిసార్లు వాళ్లు అలా చెయ్యకపోయినా అభిమానులు అర్థం చేసుకుంటారు. అయితే తాజాగా ముంబైలో జరిగిన ఘటన మాత్రం దీనికి పూర్తిగా వ్యతిరేకం. టీమిండియా స్టార్ ప్లేయర్ పృథ్వీ షాను కొందరు వెళ్లి సెల్ఫీ అడిగారు. వారితో ఫొటో దిగిన అతను వెళ్లిపోబోయాడు.

సెల్ఫీ ఇవ్వలేదని..

ఈ సమయంలో వాళ్లు మరోసారి సెల్ఫీ అడిగారు. దీనికి నిరాకరించిన పృథ్వీ షా పక్కకు వెళ్లిపోయాడు. ఈ ఘటన ముంబైలోని సహారా స్టార్ హోటల్‌లోని మ్యాన్షన్ క్లబ్‌లో జరిగింది. అయితే తమకు సెల్ఫీ ఇవ్వలేదని ఆగ్రహం తెచ్చుకున్న ఈ దుండగులు.. హోటల్ బయట పృథ్వీ షా కోసం కాపుకాశారు. అతను తన స్నేహితుడితోపాటు బయటకు రావడం చూశారు. ఆ తర్వాత కారును వెంబడించి ఒక పెట్రోల్ పంప్ సమీపంలో దానిపై దాడి చేశారు.

 బేస్ బాల్ బ్యాట్లతో దాడి..

బేస్ బాల్ బ్యాట్లతో దాడి..

బేస్ బాల్ బ్యాట్లతో కారు అద్దాలు పగలగొట్టేశారు. తీరాచూస్తే ఆ కారులో పృథ్వీ షా లేడు. అతను వేరే కారులో వెళ్లిపోవడంతో ప్రమాదం తప్పించుకున్నాడు. కానీ అతని స్నేహితుడు మాత్రం ఆ దుండగులకు దొరికిపోయాడు. కారు నాశనం చేయడంతో ఆగని ఆ దుండగులు.. కారు యజమానిని బెదిరించి తమకు రూ.50 వేలు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ కూడా చేశారట. వారి నుంచి తప్పించుకున్న తర్వాత ఈ ఘటనపై పృథ్వీ షా స్నేహితుడు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

అసలు ఏమైందంటే?

అసలు ఏమైందంటే?

సానా గిల్, శోభిత్ ఠాకూర్ అనే ఇద్దరు ఇదంతా చేసినట్లు తెలుస్తోంది. వారిద్దరూ పృథ్వీ షాతో ఒకసారి సెల్ఫీ దిగారు. ఆ తర్వాత మళ్లీ వెళ్లి తమకు సెల్ఫీ కావాలని అడగడంతో షా నిరాకరించాడు. వాళ్లు అతన్ని ఇబ్బంది పెట్టడంతో హోటల్ మేనేజర్ వచ్చి వారిని బయటకు సాగనంపాడు. ఈ కోపంతోనే పృథ్వీ షాపై దాడి చేయాలని వాళ్లు నిర్ణయించుకున్నారు. స్నేహితుడి కారులోనే షా వెళ్తున్నాడని భావించారు. ఈ నేపథ్యంలోనే స్నేహితులతో కలిసి వచ్చి ఆ కారుపై దాడి చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్టున్నట్లు చెప్పారు.

Story first published: Thursday, February 16, 2023, 17:14 [IST]
Other articles published on Feb 16, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+