Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కొత్త కారు కొనుక్కుంది: సచిన్ ఇచ్చిన కారుని తిరిగిచ్చేసిన దీపా

హైదరాబాద్: రియో ఒలింపిక్స్ ఆసాధారణ ప్రదర్శనకు చేసినందుకు గాను క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ చేతుల మీదుగా తాను అందుకున్న బీఎండబ్ల్యూ కారుని భారత స్టార్ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్‌ తిరిగి ఇచ్చేసింది. బీఎండబ్ల్యూ కారు స్థానంలో మరో కారుని కొనుక్కుంది.

వివరాల్లోకి వెళితే రియో ఒలింపిక్స్ దేశం గర్వించదగ్గ ప్రదర్శన చేసినందుకు సచిన్ చేతుల మీదగా దీపా కర్మాకర్ బీఎండబ్ల్యూ కారు అందుకుంది. అయితే త్రిపుర రాజధాని అగర్తలలో బీఎండబ్ల్యూకు సర్వీస్‌ సెంటర్‌ లేదని, అక్కడి వీధుల్లో తాను బీఎండబ్ల్యూ కారును వాడలేనంటూ తనకు బహుమతి ఇచ్చిన చాముండేశ్వరీనాథ్‌కు తిరిగి ఇచ్చేసింది.

కారు కోసం రాష్ట్రాన్ని కించపరుస్తావా!: దీపాపై త్రిపుర సర్కార్‌ ఫైర్

ఆమె నివసించే అగర్తల రోడ్లపై ఖరీదైన బీఎండబ్ల్యూ కారును తిప్పడం చాలా కష్టమైన పని. రోడ్డుపై ఎక్కువగా గుంతలు, ఎత్తుపల్లాలు ఉండటంతో పాడయ్యే అవకాశాలే ఎక్కువ. దీంతో అంత ఖరీదైన కారు పాడవుతుందనే ఉద్దేశంతో దీప ఈ నిర్ణయం తీసుకుంది.

Gymnast Dipa Karmakar returns BMW car presented by Sachin Tendulkar

అయితే కారుకు బదులు కుదిరితే డబ్బులు ఇవ్వాలని కోరింది. దీంతో ఆమె కోరిక మేరకు చాముండేశ్వరీనాథ్‌ కారుని పంపితే, ఆ కారు ఖరీదుని దీపా అకౌంట్లో వేస్తానని చెప్పినట్లు ఆయన తెలిపారు. ఆమె ప్రతిపాదనకు తగ్గట్టుగానే రూ.25 లక్షలు దీపా అకౌంట్లో వేశారు.

సచిన్‌కు షాక్!: బీఎండబ్ల్యూ కారును తిరిగిచ్చేస్తున్న దీపా

సచిన్ నుంచి అందుకున్న బీఎండబ్ల్యూ కారు స్ధానంలో దీపా కర్మాకర్‌ కొత్త హ్యుందాయ్‌ ఎలెంట్రా కారును కొనుగోలు చేసినట్లు ఆమె కోచ్‌ బిశ్వేశ్వర్‌ నంది వెల్లడించారు. అంతేకాదు అగర్తల నగరంలో దానికి సర్వీస్‌ సెంటర్‌ కూడా ఉందని ఆయన చెప్పారు.

రియో ఒలింపిక్స్‌లో పోల్‌వాల్ట్‌లో ఫైనల్‌కు చేరిన తొలి భారత క్రీడాకారిణిగా దీపా కర్మాకర్ సరికొత్త చరిత్రను సృష్టించింది. భారత జిమ్నాస్టిక్స్‌లో 52 ఏళ్ల చరిత్రను తిరగరాస్తూ బరిలోకి దిగిన తొలి ఒలింపిక్స్‌లోనే దీపా కర్మాకర్ అద్భుత విన్యాసాలను కనబర్చింది.

రియో ఒలింపిక్స్ ఫైనల్లో 15.006 పాయింట్లు సాధించి 0.15 తేడాతో తృటిలో కాంస్య పతకం చేజార్చుకుంది. దీంతో రియోలో పతకం తేలేకపోయినా.. భారత అభిమానుల గుండెల్లో మాత్రం చెరుగని ముద్ర వేసింది. రియో ప్రదర్శనతో రాత్రికి రాత్రే ఇటు దేశంలో, అటు అంతర్జాతీయ స్థాయిలో దీపా పేరు మార్మోగిపోయింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+