పూరన్ రికార్డు సెంచరీ వృథా: టీ20 క్రికెట్ చరిత్రలోనే ఆల్-టైమ్ రికార్డు ఛేజింగ్!
MLC 2026: మేజర్ లీగ్ క్రికెట్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్ లో ఎవరూ ఊహించని చారిత్రాత్మక రికార్డు నమోదైంది. ఈ ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఎంఐ న్యూయార్క్ చేసిన 266 పరుగుల భారీ లక్ష్యాన్ని వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టు 18.4 ఓవర్లలోనే ఊది పడేసింది. ఈ క్రమంలో టీ20 క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద పరుగుల లక్ష్యఛేదనను విజయవంతంగా పూర్తి చేసింది. ఆక్లాండ్ కొలీజియం స్టేడియంలో జరిగిన ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో వాషింగ్టన్ ఫ్రీడమ్ 18.4 ఓవర్లలో కేవలం 4 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసి క్రికెట్ పుటలలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకుంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఎంఐ న్యూయార్క్ నిర్ణీత 20 ఓవర్లలో 267 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. కానీ కెప్టెన్ స్టీవ్ స్మిత్(110*), ఆండ్రిస్ గోస్(132) మెరుపు సెంచరీల పుణ్యమా అని వాషింగ్టన్ ఫ్రీడమే కేవలం 18.4 ఓవర్లలో 270 పరుగులు చేసి మ్యాచ్‌ను గెలుచుకుంది. టీ20 చరిత్రలోనే అత్యధిక పరుగుల ఛేజింగ్ ఇదే కావడం గమనార్హం. ఆండ్రిస్ గోస్ 132 పరుగులు చేయగా.. కెప్టెన్ స్మిత్ అజేయంగా 110 పరుగులు చేశాడు. ఈ విజయంతో వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టు క్వాలిఫయర్స్‌లో తమ స్థానాన్ని సురక్షితం చేసుకోగా.. ఎంఐ న్యూయార్క్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది.

నికోలస్ పూరన్ సెంచరీ వృథా
ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లోవాషింగ్టన్ ఫ్రీడమ్ టాస్ గెలిచి ఎంఐ న్యూయార్క్‌ను మొదట బ్యాటింగ్ చేయమని ఆహ్వానించింది. మొదట బ్యాటింగ్‌కు వచ్చిన ఎంఐ న్యూయార్క్ కేవలం 9 పరుగులకే మోనాంక్ పటేల్ రూపంలో తమ మొదటి వికెట్‌ను కోల్పోయి పేలవమైన ఆరంభాన్ని అందుకుంది. అయితే కెప్టెన్ నికోలస్ పూరన్, క్వింటన్ డి కాక్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టి, రెండో వికెట్‌కు 118 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. డి కాక్ 24 బంతుల్లో 51 పరుగులు చేసి ఔటవ్వగా.. నికోలస్ పూరన్ కేవలం 33 బంతుల్లోనే 106 పరుగులతో అద్భుతమైన సెంచరీ సాధించాడు.
తన ఇన్నింగ్స్‌లో నికోలస్ పూరన్ 5 ఫోర్లు, 13 భారీ సిక్సర్లు బాదాడు. కీరన్ పొలార్డ్ 25 బంతుల్లో 1 ఫోర్, 8 సిక్సర్ల సహాయంతో 64 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో ట్రెంట్ బౌల్ట్ 22 పరుగులు జోడించాడు. నికోలస్ పూరన్, కీరన్ పొలార్డ్ ఇన్నింగ్స్‌ల పుణ్యమా అని.. ఎంఐ న్యూయార్క్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 266 పరుగులు చేసింది. వాషింగ్టన్ ఫ్రీడమ్ తరఫున రచిన్ రవీంద్ర అత్యధికంగా 4 వికెట్లు తీయగా.. బెన్ ద్వార్షుయిస్ 2 వికెట్లు పడగొట్టాడు. వీరితో పాటు, మిచెల్ ఓవెన్, నిఖిల్ చౌదరి చెరో వికెట్ తీసుకున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

