Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MLC 2025: కీరన్ పొలార్డ్ మెరుపులు.. ఫైనల్‌కు దూసుకెళ్లిన న్యూయార్క్

MLC 2025: మేజర్ లీగ్ క్రికెట్ 2025 టోర్నమెంట్‌లో ఎంఐ న్యూయార్క్ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. ఛాలెంజర్ మ్యాచ్‌లో టెక్సాస్ సూపర్ కింగ్స్ జట్టును 7 వికెట్ల తేడాతో ఓడించి ఎంఐ న్యూయార్క్ రెండో సారి టైటిల్ మ్యాచ్‌కు అర్హత సాధించింది. డల్లాస్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఎంఐ న్యూయార్క్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. ముందుగా టెక్సాస్ సూపర్ కింగ్స్ జట్టు బ్యాటింగ్ చేసింది. టెక్సాస్ సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 166 పరుగులు చేసింది. సూపర్ కింగ్స్ బ్యాటర్లలో కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్(42 బంతుల్లో 59 పరుగులు), అకీల్ హుస్సేన్(32 బంతుల్లో 55 పరుగులు), డొనొవాన్ ఫెరీరా(20 బంతుల్లో 32 పరుగులు) రాణించారు. ఈ ముగ్గురి ఇన్నింగ్స్ కారణంగా టెక్సాస్ సూపర్ కింగ్స్ 5 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేయగలిగింది. ఎంఐ న్యూయార్క్ బౌలర్లలో ట్రిస్టస్ లస్ 3 వికెట్లు పడగొట్టగా.. రిషిల్ ఉగార్కర్ 2 వికెట్లు తీశాడు.

అనంతరం 167 పరుగుల లక్ష్యంలో న్యూయార్క్ జట్టు బరిలోకి దిగగా.. ఆరంభంలోనే క్వింటన్ డికాక్(6) రూపంలో కీలక వికెట్ ను కోల్పోయింది. వన్ డౌన్ బ్యాటర్ మైఖేల్ బ్రేస్ వెల్(8) కూడా పూర్తిగా విఫలమయ్యాడు. ఓపెనర్ మోనాంక్ పటేల్ 39 బంతుల్లో 49 పరుగులు చేశాడు. దీనితో పాటు నికోలస్ పూరన్ 36 బంతుల్లో అజేయంగా 52 పరుగులు చేశాడు. ఎంఐ న్యూయార్క్ స్టార్ బ్యాటర్ కీరన్ పొలార్డ్ దంచి కొట్టడంతో విజయం సొంతమైంది. పొలార్డ్ 22 బంతుల్లోనే 213.64 స్ట్రైక్ రేట్‌తో 47 పరుగులు చేశాడు. ఐపీఎల్ లాగే ఇప్పుడు మేజర్ లీగ్ క్రికెట్ టోర్నీలో కూడా కీరన్ పొలార్డ్ సూపర్ కింగ్స్ ను ఓడించి జట్టుకు భారీ విజయాన్ని అందించి ఫైనల్‌కు చేర్చాడు. నికోలస్ పూరన్, కీరన్ పొలార్డ్ రెచ్చిపోవడంతో 19 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఎంఐ న్యూయార్క్ లక్ష్యాన్ని ఛేదించింది. టెక్సాస్ సూపర్ కింగ్స్ బౌలర్లలో అకీల్, జియా ఉల్ హక్, నూర్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు.

MLC 2025 Kieron Pollard Powers MI New York to the Final

ఫైనల్ మ్యాచ్ ఎవరితో, ఎప్పుడు?
లీగ్ దశలో ఎంఐ న్యూయార్క్ ప్రదర్శన అంతగా ఆకట్టుకోనప్పటికీ.. వారు ఏదో విధంగా ప్లేఆఫ్స్‌కు చేరుకున్నారు. ఇప్పుడు వారు టెక్సాస్ సూపర్ కింగ్స్ జట్టును ఓడించి ఫైనల్‌కు చేరుకున్నారు. జులై 13న(సోమవారం) వేకువ జామున 5.30 గంటలకు వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టుతో ఎంఐ న్యూయార్క్ జట్టు తలపడనుంది. వాషింగ్టన్ ప్రదర్శన మొదటి నుంచి బాగుంది. అందుకే ఫైనల్‌లో వారు గెలుపొందేందుకు ఫేవరేట్‌గా ఉన్నారు.

Story first published: Saturday, July 12, 2025, 12:52 [IST]
Other articles published on Jul 12, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+