Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్‌లో ముంచేశాడు.. ఎంఎల్‌సీలో తేల్చేశాడు.. ఎంత మోసంరా బాబు!

MLC 2025: మేజర్ లీగ్ క్రికెట్ 2025లో ఎనిమిదో మ్యాచ్ వాషింగ్టన్ ఫ్రీడమ్, లాస్‌ఏంజిల్స్ నైట్ రైడర్స్ జట్ల మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో వాషింగ్టన్ ఫ్రీడమ్ కెప్టెన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ తన అద్బుత బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. చాలా కాలం తర్వాత మ్యాక్స్‌వెల్ బ్యాట్ నుంచి ఇలాంటి అద్భుతమై ఇన్నింగ్స్ చూడటం అభిమానులకు ఆనందాన్ని కలిగించింది. గతంలో ఐపీఎల్ 2025, 2024లో రెండు సీజన్లలో మ్యాక్స్‌వెల్ దారుణంగా విఫలమయ్యాడు. కానీ ఇప్పుడు సెంచరీతో పునరాగమనం సంకేతాలు ఇచ్చాడు. ఐపీఎల్‌లో విఫలమైన మ్యాక్స్‌వెల్.. ఇప్పుడు సెంచరీ బాదడంతో ఎంత మోసం అంటూ ఐపీఎల్ అభిమానులు నెట్టింట పోస్టులు పెడుతున్నారు.

గ్లెన్ మ్యాక్స్‌వెల్ అద్భుత సెంచరీ
ఈ మ్యాచ్‌లో వాషింగ్టన్ ఫ్రీడమ్ కెప్టెన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ బౌలర్ల బౌలింగ్‌లో రెచ్చిపోయి ఆడాడు. ఈ మ్యాచ్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ 49 బంతుల్లో 106 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. తన ఇన్నింగ్స్ లో మ్యాక్స్‌‌వెల్ 13 సిక్సర్లు, 2 ఫోర్లు కొట్టాడు. ఈ సమయంలో గ్లెన్ మ్యాక్స్‌వెల్ స్ట్రైక్ రేట్ 216.33 గా ఉంది. ఒక దశలో బ్యాటింగ్ చేస్తున్నడు మ్యాక్స్‌వెల్ 15 బంతుల్లో కేవలం 11 పరుగులు మాత్రమే చేసి ఎలాంటి బౌండరీ లేకుండా ఆడాడు. ఆ తర్వాత మ్యాక్స్‌వెల్ బౌలర్లను ముచ్చెమటలు పట్టించేలా.. తర్వాతి 34 బంతుల్లో 95 పరుగులు బాదేశాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ 48 బంతుల్లోనే తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు.

MLC 2025 Glenn Maxwell s Century Stuns Fans After IPL Flop

208 పరుగులు చేసిన వాషింగ్టన్ ఫ్రీడమ్
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన వాషింగ్టన్ ఫ్రీడమ్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. ఇందులో కెప్టెన్ మ్యాక్స్‌వెల్ 106 పరుగులు ఉన్నాయి. అదనంగా, మిచెల్ ఓవెన్ 32 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఇక లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ తరపున బౌలింగ్ చేస్తూ తన్వీర్ సంఘా , కార్న్ డ్రై తలో 2 వికెట్లు తీశారు. కానీ లాస్ ఏంజిల్స్ నైట్ రైడర్స్ 13.4 ఓవర్లలోనే 77 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. ఈ మ్యాచ్ లో లాస్ ఏంజిల్స్ ఓటమి ఖరారైంది.

Story first published: Wednesday, June 18, 2025, 9:47 [IST]
Other articles published on Jun 18, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+