For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

MLC 2025: ఒకే ఓవర్లో 6,6,6,2,2,6.. సఫారీ ఆటగాడి సునామీ ఇన్నింగ్స్ (వీడియో)

MLC 2025: మేజర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్‌లో టెక్సాస్ సూపర్ కింగ్స్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఈ టోర్నీలో వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టుపై టెక్సాస్ సూపర్ కింగ్స్ 43 పరుగుల తేడాతో విజయభేరి మోగించింది. వాషింగ్టన్ ఫ్రీడమ్-టెక్సాస్ సూపర్ కింగ్స్ జట్ల మధ్య వర్షం కారణంగా మ్యాచ్‌ను 5 ఓవర్లకు కుదించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన టెక్సాస్ సూపర్ కింగ్స్ జట్టు 5 వికెట్ల నష్టానికి 87 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టు 5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 44 పరుగులే చేయగలిగింది.

టెక్సాస్ సూపర్ కింగ్స్ ఓపెనర్లు మార్కస్ స్టొయినీస్(2), డార్లీ మిచెల్(6 రిటైర్డ్ హర్ట్) నిరాశపరిచినప్పటికీ.. శుభమ్ రంజనే(14 బంతుల్లో 39*), డోనోవన్ ఫెరీరా( 9 బంతుల్లో 37*) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. దక్షిణాఫ్రికాకు చెందిన డోనోవన్ ఫెరీరా.. ఆఖరి ఓవర్ వేసిన మిచెల్ ఓవెన్ బౌలింగ్‌లో 4 సిక్సర్లు, 2 డబుల్స్ సాయంతో ఏకంగా 28 రన్స్ బాదాడు. డోనోవన్ విధ్వంసకర బ్యాటింగ్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. కాగా వాషింగ్టన్ ఫ్రీడమ్ బౌలర్లలో ఓ వికెట్ సాధించాడు. అంతకు ముందు 4వ ఓవర్లోనూ టెక్సాస్ కు 25 పరుగులు వచ్చాయి. తొలి 3 ఓవర్లలో 34 పరుగులు ఇచ్చిన వాషింగ్టన్ ఫ్రీడమ్.. చివరి 2 ఓవర్లలో ఏకంగా 54 పరుగులు సమర్పించుకుంది.

MLC 2025 Donovan Ferreira Smashes 28 Runs in One Over Watch the Viral Video

అనంతరం 88 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వాషింగ్టన్ ఫ్రీడమ్ జట్టు నిర్ణీత 5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 44 పరుగులు మాత్రమే చేయగలిగింది. వాషింగ్టన్ బ్యాటర్లలో గ్లెన్ ఫిలిప్స్(18) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టెక్సాస్ సూపర్ కింగ్స్ బౌలర్లలో బర్గర్ 2, అకిల్ హుసేన్, నూర్ అహ్మద్ తలో వికెట్ సాధించారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే ఈ రెండు జట్లు తమ ప్లే ఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకున్నాయి.

Story first published: Thursday, July 3, 2025, 13:01 [IST]
Other articles published on Jul 3, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+