సన్‌రైజర్స్‌తో కీలక పోరుకు ముంబై ఇండియన్స్ రెడీ అయింది. వాంఖడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ముంబై సారధి రోహిత్ శర్మ టాస్ గెలిచాడు. తాము ముందుగా బౌలింగ్ చేస్తామని, ఆ తర్వాత ఛేజింగ్ చేస్తామని రోహిత్ తెలిపాడు. ఇక్కడి పిచ్‌ను బట్టే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు.
'మేం ఛేజింగ్ చేయడం కంఫర్ట్‌గా ఫీల్ అవుతున్నాం. దానికితోడు ఇక్కడ పిచ్‌ను చూసిన తర్వాత ముందుగా బౌలింగ్ చేయాలని డిసైడ్ అయ్యా. ఈ పిచ్ కొంత డ్రైగా కనిపిస్తోంది. సూర్యాస్తమయం తర్వాత బ్యాటింగ్ మరింత సులభంగా మారుతుంది' అని చెప్పాడు. అలాగే తమ జట్టులో ఒక కీలక మార్పు చేసినట్లు తెలియజేశాడు.

యువ స్పిన్నర్ హృతిక్ షోకీన్‌ను పక్కన పెట్టేశామని, అతని స్థానంలో కార్తికేయ ఆడుతున్నాడని రోహిత్ చెప్పాడు. 'మేం కేవలం గెలవాలనే అనుకుంటున్నాం. ఎంత తేడాతో, ఎలా గెలవాలని ఆలోచించడం లేదు. ఇక్కడి పరిస్థితులు మాకు బాగా తెలుసు. ఇక్కడ మా వాళ్లు మంచి రెస్పాన్స్ కూడా ఇస్తున్నారు. గెలవాలంగే మనం బాగా ఆడటం తప్ప మరే మార్గం ఉండదు కదా' అన్నాడు.
తాము ఈ సీజన్‌ను కనీసం బలంగా ముగించాలని అనుకుంటున్నామని సన్‌రైజర్స్ కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ చెప్పాడు. 'మేం అనుకున్నట్లు ఈ సీజన్ ఆడలేకపోయాం. మా బెంచ్ బలాన్ని టెస్ట్ చేయడానికి ఇదొక మంచి అవకాశం. కార్తిక్ త్యాగి, ఉమ్రాన్ మాలిక్ ఇద్దరూ ఈ మ్యాచ్ ఆడుతున్నారు' అని వెల్లడించాడు.
వాళ్లిద్దరూ చక్కగా రాణిస్తారని అనుకుంటున్నట్లు తెలిపాడు. వాంఖడే పిచ్ భారీ స్కోర్లకు పెట్టింది పేరని చెప్పిన మార్క్రమ్.. తమ బ్యాటర్లు భయం లేకుండా ఎదురు దాడి చేయడానికి ఇదొక మంచి అవకాశమని అభిప్రాయపడ్డాడు. ఒక బ్యాటింగ్ యూనిట్‌గా తాము ఈ మ్యాచ్‌లో క్లిక్ అవుతామని ఆశిస్తున్నట్లు చెప్పాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్: మయాంక్ అగర్వాల్, వివ్రాంత్ శర్మ, ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), హెన్రిక్ క్లాసెన్, హ్యారీ బ్రూక్, గ్లెన్ ఫిలిప్స్, నితీష్ కుమార్ రెడ్డి, సన్వీర్ సింగ్, మయాంక్ డగర్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, నేహాల్ వధీర, క్రిస్ జోర్డాన్, పీయూష్ చావ్లా, జేసన్ బెహ్రెండాఫ్, కుమార్ కార్తికేయ, ఆకాష్ మధవాల్