Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MIvsSRH : ఎక్కడ దాచార్రా ఈ ట్యాలెంట్‌ని?.. సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్‌పై ఫ్యాన్స్ ఫైర్!

ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. ఈ జట్టుకు ఇదే చివరి లీగ్ మ్యాచ్ కావడంతో తమ బెంచ్ బలాన్ని చెక్ చేసుకునే అవకాశం దక్కిందని టాస్ సమయంలో ఎయిడెన్ మార్క్రమ్ చెప్పాడు. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌కు దొరికిన ఆరంభం చూసిన ఫ్యాన్స్ అయితే షాకైపోయారు.

తొలిసారి మ్యాచ్‌లో ఆడే అవకాశం దక్కించుకున్న యువ ప్లేయర్ వివ్రాంత్ శర్మ (69) అదరగొట్టాడు. మయాంక్ అగర్వాల్ కూడా హాఫ్ సెంచరీతో చెలరేగాడు. వీళ్లిద్దరూ కలిసి సన్‌రైజర్స్‌కు అదిరే ఆరంభం అందించారు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ముంబై బౌలర్లపై ఎదురు దాడికి దిగిన ఈ జోడీ వేగంగా హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకుంది.

IPL Match Fans slam SRH for not giving Vivrant Shamra more chances

అయితే మధవాల్ వేసిన 14వ ఓవర్లో భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన వివ్రాంత్ అవుటయ్యాడు. సబ్‌స్టటిట్యూట్ ఫీల్డర్‌గా వచ్చిన రమణ్‌దీప్ చక్కని క్యాచ్ అందుకోవడంతో అతను పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్‌లో వివ్రాంత్ బ్యాటింగ్ చూసిన ఫ్యాన్స్ అంతా ఆశ్చర్యపోయారు. అసలు ఇంత ట్యాలెంట్ ఉన్న ప్లేయర్‌ను ఇంతకాలం ఎలా పక్కన పెట్టారు? అని సన్‌రైజర్స్ టీం మేనేజ్‌మెంట్‌పై మండిపడుతున్నారు.

అగర్వాల్ కూడా ఈ మ్యాచ్‌లో జూలు విదిల్చాడు. ఆరంభంలో కొంత జాగ్రత్తగా ఆడిన అతను.. హాఫ్ సెంచరీ పూర్తయిన తర్వాత భారీ షాట్లతో అలరించాడు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరిగెత్తించాడు. ఇది చూసిన ఫ్యాన్స్ అతన్నే తిడుతున్నారు. ఇంతకాలం నెమ్మదైన ఆటతో ప్రాణం తీసి.. చివరి మ్యాచ్‌లో ఆడుతున్నావా? అని విమర్శిస్తున్నారు.

ఏదేమైనా ఈ మ్యాచ్ చూసిన ఫ్యాన్స్ ఇక వచ్చే సీజన్‌లో ఓపెనింగ్ జోడీ విషయంలో కొత్త ప్రయోగాలు అక్కర్లేదని అంటున్నారు. ఏం జరిగినా సరే వివ్రాంత్‌ను ఓపెనర్‌గా పంపాలని, అవసరం అయితే అభిషేక్‌ను ఫినిషర్‌గా పంపితే బెటర్ అని సలహాలు ఇస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ఓడితే ముంబై ప్లేఆఫ్స్ చేరడం చాలా కష్టంగా మారుతుంది. మరి ఈ మ్యాచ్‌లో ఆ జట్టు ముందు సన్‌రైజర్స్ ఎంత భారీ టార్గెట్ ఉంచుతుందో చూడాలి.

Story first published: Sunday, May 21, 2023, 16:56 [IST]
Other articles published on May 21, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+