సన్‌రైజర్స్‌తో కీలక పోరుకు ముంబై ఇండియన్స్ రెడీ అయింది. ఈ మ్యాచ్‌లో ముంబైని ఓడించడం చాలా కష్టమని టీమిండియా మాజీ ఓపెనర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాష్ చోప్రా అన్నాడు. వాంఖడే స్టేడియంలో ముంబై బ్యాటింగ్ చాలా బలంగా ఉందని, వాళ్లను ఓడించడం చాలా కష్టమని అభిప్రాయపడ్డాడు.
'లక్నోతో ఆడిన చివరి మ్యాచ్‌లో ముంబై చివరి వరకు పోరాడి ఓడింది. ఆ ఒక్క మ్యాచ్ మినహా మిగతా సీజన్‌లో వాళ్ల బ్యాటింగ్ చాలా బాగా రాణిస్తోంది. ముఖ్యంగా ఈ స్టేడియంలో ముంబై బ్యాటింగ్ విభాగం చాలా బలంగా కనిపిస్తోంది. కాబట్టి ఈ మ్యాచ్‌లో విజయం సాధించే అవకాశం ముంబైకే ఎక్కువగా కనిపిస్తోంది' అని చెప్పాడు.

తమ బ్యాటింగ్‌ను నమ్ముకొని ముంబై ఈ మ్యాచ్‌లో గెలవడానికే చూస్తుంది. 'ఈ మ్యాచ్‌లో కూడా ముంబై తన బలమైన బ్యాటింగ్‌తో బరిలో దిగుతుంది. ఎందుకంటే వాళ్ల బ్యాటింగ్ రాణిస్తే ఆ క్లాస్ ఈజీగా కనిపిస్తుంది. వాళ్ల బ్యాటింగ్ రాణిస్తే గెలవడం కూడా ఈజీనే' అని వివరించాడు. ఈ టీంలో సూర్యకుమార్ యాదవ్ (486), ఇషాన్ కిషన్ (425) ఇద్దరూ చాలా కీలకంగా ఉన్నారు.
ఈ సీజన్‌లో ముంబై బ్యాటింగ్‌లో వాళ్లు చాలా కీలకంగా మారారు. ఆ టీంలో మిగతా బ్యాటర్లు ఎవరూ ఈ సీజన్‌లో కనీసం 300 పరుగులు కూడా చేయలేదు. అయితే ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడిన వారే కావడం గమనార్హం. అదే సమయంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ అంత గొప్ప ఫామ్‌లో లేదు. ఈ విషయాన్ని కూడా ఆకాష్ చోప్రా గుర్తించాడు.
'హైదరాబాద్ ఎలా ఆడగలదో ఆ స్థాయిలో ఆడటం లేదు. లక్నో బ్యాటర్లు అభిషేక్ శర్మ ఓవర్లో భారీగా పరుగులు చేసిన విధానం.. అలాగే ఆర్సీబీతో మ్యాచ్‌లో కోహ్లీ, డుప్లెసిస్ ఈ బౌలింగ్ ఎటాక్‌ను ఎలా ఆడుకున్నారో తెలిసిందే. ఇదంతా చూస్తే సన్‌రైజర్స్ అంత బలంగా కనిపించడం లేదు. వాళ్లు ఈ మ్యాచ్ గెలవడం అంత ఈజీ కాదు' అని చెప్పాడు. ఈ టీంలో క్లాసెన్ మినహా ఎవరూ ఆడటం లేదని సూచించాడు.