Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MIvsRR : రోహిత్‌ కెప్టెన్సీపై ముంబై ఇండియన్స్ రియాక్షన్.. వైరల్ అవుతున్న వీడియో!

ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ 36వ పడిలో అడుగు పెడుతున్నాడు. అంతేకాదు, ముంబై కెప్టెన్‌గా పది సంవత్సరాలు కూడా పూర్తి చేసుకున్నాడు. 2013 ఐపీఎల్ సీజన్ సగంలో ఉండగా.. రికీ పాంటింగ్ నుంచి జట్టు పగ్గాలను రోహిత్ అందుకున్నాడు. అప్పటి నుంచి అతను మళ్లీ వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

ఐపీఎల్‌లో అత్యంత సక్సెస్ ఫుల్ కెప్టెన్‌గా రికార్డు సృష్టించాడు. ఇప్పటి వరకు ఐదుసార్లో ఐపీఎల్ ట్రోఫీ నెగ్గాడు. అంతేకాదు, తను కెప్టెన్సీ చేసి 149 మ్యాచుల్లో 81 మ్యాచుల్లో విజయం సాధించి మరో రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో అత్యధిక విజయాలు సాధించిన రెండో కెప్టెన్‌గా నిలిచాడు. ఈ జాబితాలో 128 విజయాలతో ఎంఎస్ ధోనీ అగ్రస్థానంలో ఉన్నాడు.

MIvsRR Today IPL Match Mumbai Indians react to Rohit legacy

ఇప్పుడు రోహిత్ బర్త్‌డే సందర్భంగా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ తమ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేసింది. దీనిలో సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, జేసన్ బెహ్రండాఫ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్ సహా ఆ జట్టులోని పలువురు క్రీడాకారులు రోహిత్ విజయాలను గుర్తుచేసుకున్నారు. అలాగే అతనికి బర్త్‌డే విషెస్ కూడా చెప్పారు.

'మనం ఇప్పుడు రోహిత్ 10వ సంవత్సరంలో ఉన్నాం. ముంబై ఇండియన్స్ వంటి ఫ్రాంచైజీలో కెప్టెన్‌గా పదేళ్లు కొనసాగడం చాలా గొప్ప విషయం. అసలు అదే పెద్ద ఘనత. దానికితోడు ఈ ఫ్రాంచైజీకి ఎంతో గౌరవం తీసుకొచ్చాడు. అతని కెప్టెన్సీలో ఐదు ట్రోఫీలు కూడా నెగ్గాం' అని ఈ వీడియోలో సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు.

అయితే గత సీజన్ నుంచి రోహిత్ సేన పేలవ ప్రదర్శన చేస్తోంది. ఈ ఏడాది కొన్ని అద్భుతమైన ప్రదర్శనలు చేసినా కూడా ముంబై ఇంకా పాయింట్ల పట్టికలో 9వ స్థానంలోనే ఉంది. ఈ సీజన్‌లో కేవలం మూడే విజయాలు సాధించిందీ జట్టు. ఈ ఆదివారం రాజస్థాన్‌తో జరిగే మ్యాచ్.. కెప్టెన్‌గా రోహిత్‌కు 150వ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో గెలిచి చరిత్ర సృష్టించాలని రోహిత్ భావిస్తున్నాడు.

Story first published: Sunday, April 30, 2023, 16:10 [IST]
Other articles published on Apr 30, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+