Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MIvsRR : బర్త్‌డే బాయ్ గెలిపిస్తాడా?.. రాజస్థాన్‌పై ముంబై గెలిచే ఛాన్స్ ఉందా?

ఐపీఎల్ 2023లో మరో బ్లాక్ బస్టర్ మ్యాచ్‌కు రంగం సిద్ధం అవుతోంది. ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడేందుకు రెడీ అవుతున్నాయి. చివరగా ఈ రెండు టీమ్స్ ఆడిన మ్యాచులు మిస్ అయిన స్టార్ పేసర్లు ట్రెంట్ బౌల్ట్, జోఫ్రా ఆర్చర్ ఇద్దరూ ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మరి ఈ మ్యాచ్‌లో గెలిచే అవకాశం ఎవరికి ఉందో చూద్దామా?

ఈ ఐపీఎల్‌లో బెస్ట్ ఓపెనింగ్ జోడీల్లో యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్ జోడీ ఒకటి. వీళ్లిద్దరూ కూడా ధనా ధన్ షాట్లతో ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెడుతున్న వాళ్లే అదే సమయంలో ముంబై బౌలింగ్‌లో అంత పదును లేదు. ఒకవేళ జోఫ్రా ఆర్చర్ జట్టుతో చేరినా కూడా అతను ఫామ్‌లో లేడు. ఇలాంటి సమయంలో అర్జున్ టెండూల్కర్ వంటి కుర్ర బౌలర్‌కు జైస్వాల్, బట్లర్ జోడీ చుక్కలు చూపించే ఛాన్స్ ఉంది.

MIvsRR

ఇక మిడిల్ ఓవర్లలో ముంబై బౌలింగ్ భారమంతా పీయూష్ చావ్లాపై పడుతోంది. అతన్ని సమర్ధవంతంగా ఎదుర్కొంటే ముంబై ముందు భారీ లక్ష్యం ఉంచడం రాజస్థాన్‌కు చాలా సులభమైన పని. అదే సమయంలో రాజస్థాన్ మిడిల్, లోయర్ ఆర్డర్ బ్యాటర్లు కూడా అద్భుతంగా ఆడుతున్నారు. ఈ క్రమంలో ముంబై బౌలర్లు వీళ్లను ఇబ్బంది పెట్టడం కష్టంగా కనిపిస్తోంది.

పీయూష్ చావ్లా మంచి ఫామ్‌లో ఉన్నా కూడా రాజస్థాన్ వద్ద మంచి స్పిన్నర్లు ఉన్నారు. యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్ ఇద్దరూ ఈ సీజన్‌లో బాగానే బౌలింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా అశ్విన్ తన బెస్ట్ పెర్ఫామెన్స్ ఇస్తున్నాడు. ఇలా అన్ని విభాగాల్లో రాజస్థాన్ మెరుగైన స్థితిలో ఉంది. ఈ క్రమంలో ముంబై కనుక మొదట బ్యాటింగ్ చేస్తే ఆ జట్టు గెలవడం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ల బౌలర్లు టార్గెట్‌ను కాపాడలేరు.

అదే సమయంలో ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ ఇద్దరూ కూడా అంత గొప్ప ఫామ్‌లో లేరు. అడపా దడపా ఆడుతున్నా ఎక్కువగా విఫలం అవుతున్నారు. సూర్యకుమార్ యాదవ్ ఇప్పుడిప్పుడే మళ్లీ గాడిన పడుతున్నాడు. తిలక్ వర్మ ఫర్వాలేదనిపిస్తుండగా.. కామెరూన్ గ్రీన్ కూడా రాణిస్తున్నాడు. ఈ క్రమంలో రాజస్థాన్ కనుక ముందుగా బ్యాటింగ్ చేస్తే.. ఎలాంటి టార్గెట్ తమ ముందు ఉంచినా ముంబై బ్యాటర్లు దాన్ని ఛేజ్ చేసే సత్తా ఉన్న వాళ్లే.

పేపర్ మీద చూసుకుంటే రాజస్థాన్‌కు గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఈ రెండు జట్ల మధ్య రికార్డులు పరిశీలిస్తే.. ఈ మ్యాచ్ కచ్చితంగా మరో థ్రిల్లర్ అవుతుందని అర్థం అవుతుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్ ఎంచుకునే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది. ఏదేమైనా ఈ మ్యాచ్‌లో గెలిచే ఛాన్సులు మాత్రం రాజస్థాన్‌కే ఒకింత ఎక్కువగా ఉన్నాయి.

Story first published: Sunday, April 30, 2023, 13:18 [IST]
Other articles published on Apr 30, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+