Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MIvsRCB : వరుసగా ఫెయిల్ అవుతున్నా.. రోహిత్‌పై ముంబై ఇండియన్స్ నమ్మకం..!

ఈ ఏడాది ఐపీఎల్‌లో అత్యంత పేలవ ఫామ్‌లో ఉన్న బ్యాటర్లలో రోహిత్ శర్మ ఒకడు. ఇప్పటి వరకు ఆడిన పది మ్యాచుల్లో ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే కొట్టిన అతను.. మిగతా మ్యాచుల్లో ముంబై ఇండియన్స్‌కు సరైన ఆరంభం అందించలేకపోయాడు. పైగా చివరి రెండు మ్యాచుల్లో డకౌట్‌గా పెవిలియన్ చేరాడు.

ఇంత జరిగినా సరే రోహిత్‌కు తమ టీం మద్దతు ఎప్పుడూ ఉంటుందని ఆ జట్టు యంగ్ ప్లేయర్ కామెరూన్ గ్రీన్ అన్నాడు. రోహిత్‌కు తమ ఫ్రాంచైజీ పూర్తి మద్దతు ఇస్తోందని, ఆటగాళ్లు కూడా అతనిపై నమ్మకం ఉంచారని చెప్పుకొచ్చాడు. ఇకపై ఆడే మ్యాచుల్లో రోహిత్ రాణిస్తాడని తను నమ్ముతున్నట్లు తెలిపాడు.

 Rohit

'ముంబై ఇండియన్స్‌తో రోహిత్ అనుబంధం ఎలాంటిదో అందరికీ తెలుసు. తన కెరీర్‌లో రోహిత్ ఎంతగా రాణించాడో కూడా తెలుసు. అందుకే మేం అతనికి పూర్తి మద్దతు ఇస్తున్నాం. కొన్ని మ్యాచుల్లో రోహిత్ చక్కగా ఆడాడు. తను కచ్చితంగా తిరిగి ఫామ్ అందుకుంటాడనే నమ్మకం ఉంది' అని గ్రీన్ చెప్పాడు. ఆర్సీబీతో కీలకమైన మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రెస్‌మీట్‌లో అతను ఈ కామెంట్స్ చేశాడు.

ఆర్సీబీపై గెలవాలంటే తమ బెస్ట్ ఆటతీరు కనబరచాల్సిన అవసరం ఉందని గ్రీన్ అభిప్రాయపడ్డాడు. ఇప్పటి వరకు ఆడిన పది మ్యాచుల్లో తమ ప్లేయర్లు చాలా విషయాలు నేర్చుకున్నారని, ఇకపై అన్ని విభాగాల్లో కఠినంగా ఆడతామని తెలిపాడు. మిగతా మ్యాచుల్లో గెలవాలంటే అలా ఉండక తప్పదని తేల్చేశాడు.

'ఇప్పటి వరకు మేం నేర్చుకున్న విషయాలు.. మిగతా టోర్నమెంట్లో కలిసొస్తాయని ఆశిస్తున్నా. గెలిస్తే రెండో ప్లేస్‌లో, ఓడితే చివరి నుంచి రెండో ప్లేస్‌లో ఉండే పరిస్థితి ఉందని.. కాబట్టి ఇలాంటి సమయంలో ఆటగాళ్లు ఏమాత్రం నిర్లక్ష్యం చూపించకూడదు. మాది చాలా మంచి టీం. అంతా పెర్ఫామ్ చేస్తే ఎవరూ ఓడించలేరు. కాబట్టి మేం ఆ నమ్మకంతోనే ఆడతాం' అని పేర్కొన్నాడు.

Story first published: Tuesday, May 9, 2023, 13:14 [IST]
Other articles published on May 9, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+