పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ చివరి ఓవర్లో ఓడిపోయింది. అప్పటి వరకు అద్భుతంగా బ్యాటింగ్ చేసినా కూడా ఓటమిని తప్పించుకోలేకపోయింది. ఈ మ్యాచ్‌లో 215 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన ముంబై గెలవడం అనుమానమే అని అంతా అనుకున్నారు. ఇషాన్ కిషన్ ఫెయిలవడంతో ముంబై కష్టాలు రెట్టింపు అయ్యాయి.
అయితే రోహిత్ శర్మ (44), కామెరూన్ గ్రీన్ (67) చెలరేగడంతో ముంబై గెలిచేలా కనిపించింది. సూర్యకుమార్ యాదవ్ (57), టిమ్ డేవిడ్ (25 నాటౌట్) కూడా అద్భుతంగా ఆడారు. కానీ చివరి ఓవర్లో 15 పరుగులు చేయాల్సిన స్థితిలో ముంబై ఓడిపోయింది. ఈ ఓవర్లో అర్షదీప్ సింగ్ సూపర్‌గా బౌలింగ్ చేశాడు. గురి తప్పని యార్కర్లతో చెలరేగాడు. ఈ ఓవర్ తొలి బంతి ఎదుర్కొన్న టిమ్ డేవిడ్ సింగిల్ తీశాడు.

ఆ తర్వాతి బంతిని తిలక్ వర్మ డాట్ బాల్ ఆడాడు. దీంతో అతనిపై మరింత ఒత్తిడి పెరిగింది. మరుసటి బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే అర్షదీప్ వేసిన సూపర్ యార్కర్‌కు మిడిల్ స్టంప్ విరిగింది. తిలక్ వర్మ నిరాశగా మైదానం వీడాడు. ఆ తర్వాతి బంతికే వధీర కూడా గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేరాడు. మరుసటి బంతి డాట్ బాల్ కాగా.. చివరి బంతికి ఆర్చర్ సింగిల్ తీశాడు.
దీంతో ఈ మ్యాచ్‌లో ముంబై 13 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇది చూసిన ఫ్యాన్స్ టిమ్ డేవిడ్‌పై మీమ్స్ పేలుస్తున్నారు. ఆ చివరి ఓవర్ తొలి బంతికి అతను సింగిల్ తీయకపోయి ఉంటే.. ఈ మ్యాచ్‌లో ముంబై గెలిచేదని అంటున్నారు. ఈ సింగిల్ తీసుకున్నందుకు టిమ్ డేవిడ్ ప్రశాంతంగా నిద్ర కూడా పోలేడని కామెంట్స్ చేస్తున్నారు.
అయితే బ్యాటింగ్‌తోపాటు ఫీల్డింగ్‌లో కూడా టిమ్ డేవిడ్ చక్కగా రాణిస్తున్నాడని, పొలార్డ్‌ను మరిపిస్తున్నాడని అంటున్నారు. కానీ ఈ మ్యాచ్‌లో మాత్రం ముంబైని గెలిపించలేకపోయాడని, అతను చివరి ఓవర్ తొలి బంతికి సింగిల్ తీయడమే మ్యాచ్‌ను మలుపు తిప్పిందని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఆ తర్వాత ముంబై ఓడిపోతుంటే నాన్‌స్ట్రైకర్ ఎండ్ నుంచి చూస్తూ ఉండిపోవాల్సి వచ్చిందని చెప్తున్నారు.