ఐపీఎల్ 2023 ఎలిమినేటర్‌లో ముంబై జట్టు అద్భతంగా ఆడింది. లక్నో సూపర్ జెయింట్స్‌ను ఏమాత్రం లెక్కలోకి తీసుకలేదు. ఈ మ్యాచ్‌లో లక్నోను చిత్తుగా ఓడించిన తర్వాత ముంబై కుర్ర ప్లేయర్లు.. నవీన్‌ను టార్గెట్ చేశారు. అయితే కాసేపటికే ఆ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీతో గొడవ పడిన నవీ ఎల్ హక్.. ఎక్కడకు వెళ్లినా స్టేడియంలో 'కోహ్లీ.. కోహ్లీ..' అంటూ నినాదాలు చేస్తూ నవీన్‌ను ఆటపట్టించే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన ఫొటోను నెట్టింట టేర్ చేశారు. ఆ వెంటనే దాన్ని డిలీట్ చేసినా కూడా.. ఫలితం లేకపోయింది.

ఎలిమినేటర్‌లో ముంబై విజయం తర్వాత ముంబై కుర్ర ప్లేయర్లు కుమార్ కార్తికేయ, విష్ణు వినోద్, సందీప్ వారియర్ కలిసి ఒక ఫొటో దిగారు. డైనింగ్ టేబుల్‌పై కత్తి పెట్టిన వాళ్లు.. మూడు కోతుల్లా కళ్లు, చెవులు, నోరు మూసుకొని ఫొటో దిగారు. దీన్ని వినోద్, సందీప్ తమ ఇన్‌స్టా స్టోరీల్లో కూడం పంచుకోవడం గమనార్హం.
ఐపీఎల్‌లో ఆర్సీబీ ఫెయిలైన ప్రతిసారీ లక్నో పేసర్ నవీన్ ఉల్ హక్.. ముఖ్యంగా కోహ్లీ అవుటైనప్పుడు మామిడి పండ్ల ఫొటోలను సోషల్ మీడియాలో ఉంచాడు. దీనిపై కోహ్లీ ఫ్యాన్స్ చాలా ఆగ్రహంగా ఉన్నారు.. అంతేకాకుండా ఆర్సీబీ ప్లేఆఫ్స్ నుంచి తప్పుకున్నప్పుడు కూడా నవీన్ ఒక చెత్త వీడియోను షేర్ చేశాడు.
ఈ క్రమంలోనే వినోద్, సందీప్ ఇద్దరూ ఈ ఫొటోను నెట్టింట షేర్ చేశారు. 'స్వీట్ మ్యాంగో సీజన్' అని ఈ ఫొటోకు ట్యాగ్ లైన్ ఇచ్చారు. ఇక్కడ మరో షాకింగ్ విషయం ఏంటంటే.. ఈ ఫొటోను లక్నో పేసర్ ఆవేష్ ఖాన్ కూడా లైక్ చేయడం గమనార్హం. ఈ ఫొటోను వినోద్, సందీప్ వెంటనే డిలీట్ చేసేశారు. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ ఒకటి.
కేవలం వీళ్లే కాదు.. ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థలు స్విగ్గీ, జొమాటో కూడా ఈ పరిస్థితిని క్యాష్ చేసుకోవాలని చూస్తున్నాయి. ఈ రెండు కూడా 'స్వీట్ మ్యాంగో' ఫొటోలను పంచుకున్నాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. లక్నో ట్విట్టర్ అడ్మిన్ అయితే.. ఈ ట్రోలింగ్ తట్టుకోలేక 'మ్యాంగో' అనే పదాన్ని మ్యూట్ చేసినట్లు చెప్పాడు.