Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MIvsLSG : ముంబై గెలిచింది కానీ.. రోహిత్‌పై మండిపడుతున్న ఫ్యాన్స్!

ఐపీఎల్ ఎలిమినేటర్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ను ముంబై చిత్తుగా ఓడించింది. అయినా సరే ఆ టీం కెప్టెన్‌పై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబైకి సరైన ఆరంభం దక్కలేదు. ఓపెనర్‌గా వచ్చిన కెప్టెన్ రోహిత్.. జట్టుకు మంచి ఆరంభం అందించలేకపోయాడు.

ఒక సిక్సర్ కూడా బాదిన అతను కేవలం 11 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ (15) కూడా ఫెయిలయ్యాడు. అయితే కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నేహాల్ వధీర్ తలో చెయ్యి వేయడంతో ముంబై ఓ మోస్తరు స్కోరు చేసింది.

Rohit Sharma failed to impress again. Fans not happy with Rohit

నిర్ణీత 20 ఓవర్లలో 182 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ముంబైకి కూడా సరైన ఆరంభం దక్కలేదు. క్వింటన్ డీకాక్‌ను పక్కన పెట్టడం ఆ జట్టును బాగా దెబ్బకొట్టింది. అదే సమయంలో ముంబై యంగ్ పేసర్ ఆకాష్ మధవాల్ బంతితో చెలరేగాడు. కేవలం ఐదు పరుగులే ఇచ్చిన అతను ఐదు వికెట్లతో రాణించాడు.

దీంతో లక్నో జట్టు కేవలం 101 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ విజయంతో ముంబై జట్టు రెండో క్వాలిఫైయర్ చేరింది. ఈ సీజన్‌లో మొత్తం 15 మ్యాచులు ఆడిన అతను.. 133.33 స్ట్రైక్ రేటుతో కేవలం 324 పరుగులు మాత్రమే చేశాడు. వీటిలో ఆరు సింగిల్ డిజిట్ స్కోర్లు ఉండటం గమనార్హం.

ఈ క్రమంలోనే అభిమానులు రోహిత్‌పై మండి పడుతున్నారు. రోహిత్ ఏమాత్రం సరిగా ఆడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కటంటే ఒక్క ఏడాదిలో కూడా రోహిత్ రాణించడం లేదంటున్నారు. '2015 నుంచి టీం అంతా కలిసి రోహిత్‌ను మోస్తోంది' అంటూ ఎద్దేవా చేస్తున్నారు. అప్పటి నుంచి రోహిత్ అంత గొప్ప ఇన్నింగ్సులు ఆడలేదు.

Story first published: Thursday, May 25, 2023, 13:45 [IST]
Other articles published on May 25, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+