Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MIvsLSG : అది నోబాల్ కాదా?.. షాకైన టిమ్ డేవిడ్!

ఐపీఎల్ 2023లో అంపైర్లు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ముఖ్యంగా నోబాల్ విషయంలో అంపైర్ల తప్పుడు నిర్ణయాలపై ఆటగాళ్లతోపాటు అభిమానులు కూడా మండిపడుతున్నారు. కొన్ని రోజుల క్రితం సన్‌రైజర్స్ విషయంలో కూడా నోబాల్ గొడవ జరిగిన సంగతి తెలిసిందే.

తాజాగా ఐపీఎల్ ఎలిమినేటర్‌లో కూడా నోబాల్ విషయంలో గొడవ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు భారీ స్కోరు చేయలేకపోయింది. లోయర్ ఆర్డర్‌లో కీలమైన టిమ్ డేవిడ్ (13) ఈ కీలకమైన మ్యాచ్‌లో తేలిపోయాడు. అయితే అతను అవుటైన విధానంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.

MIvsLSG Who won Yesterda Match Fans not happy with umpiring after Tim David out

యష్ దయాళ్ వేసిన బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయిన టిమ్ డేవిడ్ అవుటయ్యాడు. అయితే దయాళ్ వేసిన డెలివరీపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. టిమ్ డేవిడ్‌కు దయాళ్ ఫుల్ టాస్ వేశాడు. దాన్ని అతను భారీ షాట్ ఆడాడు. అయితే టైమింగ్ సరిగా కుదరకపోవడంతో దాన్ని బౌండరీ లైన్ వద్ద దీపక్ హుడా ఈజీగా అందుకున్నాడు.

అయితే తను అవుట్ కాదని ఫీలయిన టిమ్ డేవిడ్ వెంటనే రివ్యూ కోరాడు. రిప్లేలో బంతి డేవిడ్ నడుం కన్నా ఎత్తులోనే ఉన్నట్లు కనిపించింది. దీంతో తను నాటౌట్ అని అతను ఫీలయ్యాడు. కానీ మూడో అంపైర్ మాత్రం ఆ బంతిని పరిశీలించి, అది లీగల్ డెలివరీనే అన్నాడు. దీంత డేవిడ్ వెనకడుగు తినాల్సి ఉంది.

ఈ బంతిని నోబాల్ ఇవ్వకపోవడంపై టిమ్ డేవిడ్ షాకైపోయాడు. ఆన్‌ఫీల్డ్ అంపైర్ వైపు చూస్తూ 'ఏంటిది?' అన్నట్లు సైగ చేశాడు. ఆ తర్వాత మైదానాన్ని వీడాడు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇది కూడా నోబాల్ ఇవ్వకపోతే ఇక నోబాల్ ఏదిరా? అని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. గతంలో కూడా నోబాల్ విషయంలోనే పలు వివాదాలు జరిగిన సంగతి తెలిసిందే.

Story first published: Thursday, May 25, 2023, 10:40 [IST]
Other articles published on May 25, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+