Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MIvsKKR : కిషన్ బ్యాటింగ్ చూసి.. నేను టైం తీసుకున్నా: సూర్యకుమార్

ముంబై ఇండియన్స్ మళ్లీ విజయాల బాట పట్టినట్లే కనిపిస్తోంది. గతేడాది వరుస ఓటములతో పాయింట్ల పట్టికలో చిట్టచివరి స్థానంలో నిలిచిన ఈ జట్టు.. ఈ ఏడాది వరుసగా రెండో ఓటముల తర్వాత అనూహ్యంగా పుంజుకుంది. ఇప్పుడు వరుసగా రెండు విజయాలతో జోరు కొనసాగిస్తోంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై అన్ని విభాగాల్లో రాణించింది.

ఫామ్ లేక తంటాలు పడిన సూర్యకుమార్ కూడా రాణించాడు. ముంబై ఆడిన తొలి మూడు మ్యాచుల్లో విఫలమైన సూర్యకుమార్ యాదవ్.. ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌గా బరిలో దిగి చెలరేగాడు. రోహిత్ లేకపోవడంతో సూర్యకు జట్టు పగ్గాలు అందించిన సంగతి తెలిసిందే. తొలిసారి సూర్య కెప్టెన్సీలో బరిలో దిగిన ముంబై అదరగొట్టింది. సూర్య కూడా ఫామ్ అందుకోవడంతో ఆ జట్టు బలంగా కనిపిస్తోంది.

Surya Kumar Yadav MI

కేకేఆర్‌ను చిత్తుగా ఓడించిన తర్వాత ఈ విజయంపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడాడు. 'చివరి మ్యాచ్‌లో విజయంతో వచ్చిన మొమెంటం కోల్పోకుండా రాణించాలని డగౌట్‌లోనే నిర్ణయించుకున్నాం' అని సూర్య చెప్పాడు. 'మా కుర్రాళ్లు అద్భుతంగా రాణించారు. నేనే ఈ మ్యాచ్ ముగించాల్సింది. ఏదేమైనా.. మేం ఆడిన విధానం మాత్రం సంతృప్తినిచ్చింది. మధ్యాహ్నం ఈ పిచ్ చూసి కొంచెం డ్రైగా ఉందని అనుకున్నాం' అని తెలియజేశాడు.

'కానీ మా వాళ్లు బ్యాటింగ్ చేయడం మొదలు పెట్టిన తర్వాత పిచ్ కూడా కుదురుకున్నట్లు కనిపించింది. వాంఖడేలో మధ్యాహ్నం మ్యాచ్ జరిగితే.. 170-180 పరుగుల స్కోరు చేస్తే గెలిచే అవకాశాలు ఉంటాయి' అని సూర్య వివరించాడు. అయితే ఇషాన్ కిషన్ జట్టుకు అద్భుతమైన ఆరంభం అందించాడని కొనియాడాడు. ఆ తర్వాత తను ఎదుర్కొన్న తొలి ఆరేడు బంతులను జాగ్రత్తగా ఆడానని, సరిగ్గా ఆడితే మంచి స్కోరు చేయగలననే నమ్మకంతో ఉన్నానని సూర్య అన్నాడు.

ముంబై ఆడిన తొలి మూడు మ్యాచుల్లో విఫలమైన సూర్యకుమార్ యాదవ్.. ఈ మ్యాచ్‌లో కెప్టెన్‌గా బరిలో దిగి చెలరేగాడు. రోహిత్ లేకపోవడంతో సూర్యకు జట్టు పగ్గాలు అందించిన సంగతి తెలిసిందే. 'టాపార్డర్ మంచి ఆరంభం అందిస్తే.. మా లోయర్ ఆర్డర్‌లో చాలా ఫైర్ పవర్ ఉంది. ఇక మా బౌలింగ్‌లో పీయూష్ చావ్లా వేసిన స్పెల్ లెజెండరీ అనే చెప్పాలి. మిగతా బౌలర్లు అందరూ తీవ్రమైన ఒత్తిడిలో ఉండగా చావ్లా అద్భుతంగా రాణించి, అందరికీ ఒక మార్గం చూపించాడు' అని మెచ్చుకున్నాడు.

Story first published: Monday, April 17, 2023, 7:24 [IST]
Other articles published on Apr 17, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+