Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MIvsGT : ఏం ఆటరా అది?.. షమీకి చుక్కలు చూపించిన తిలక్ వర్మ!

గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న రెండో క్వాలిఫైయర్‌లో ముంబైకి అనుకున్న ఆరంభం దక్కలేదు. గుజరాత్ బ్యాటింగ్ సమయంలో ఓవర్ల మధ్యలో ఎండ్ మారుతుండగా.. క్రిస్ జోర్డాన్ భుజం కంటికి తగలడంతో ఇషాన్ కిషన్ గాయపడ్డాడు. దీంతో ముంబై ఛేజ్‌లో ఓపెనర్‌గా రాలేదు.

ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ (8)తో కలిసి నేహాల్ వధీర (4) ఓపెనింగ్ చేశాడు. తొలి బంతికి బౌండరీ బాదిన వధీర.. ఆ మరుసటి బంతికే షమీ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడబోయి తడబడ్డాడు. దీంతో ఎడ్జ్ తీసుకున్న బంతిని కీపర్ సాహా సులభంగా అందుకోవడంతో వధీర పెవిలియన్ చేరాడు. ఇది జరిగిన కాసేపటికే రోహిత్ శర్మ కూడా అవుటయ్యాడు.

Tilak Varma

రోహిత్ ఇలా ఫెయిలవడంతో ముంబై అభిమానులు ఆందోళన చెందారు. రెండో క్వాలిఫైయర్‌లోనే తమ జట్టు కనీసం పోరాడకుండా ఇంటి దారి పడుతుందా? అని అనుకున్నారు. ఆ తర్వాత కాసేపటికే షమీ వేసిన బంతి అద్భుతంగా స్వింగ్ అవడంతో కామెరూన్ గ్రీన్ తడబడ్డాడు. ఆ బంతి అతని ఎడం మోచేతిని బలంగా తాకింది. దీంతో నొప్పితో మైదానం వీడాడీ ఆస్ట్రేలియన్ ఆల్‌రౌండర్.

ఇలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ (43) అదరగొట్టాడు. గుజరాత్ టాప్ బౌలర్ మహమ్మద్ షమీ వేసిన ఓవర్లో వరుసగా నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్‌తో అదరగొట్టాడు. కేవలం 13 బంతుల్లోనే 43 పరుగులు చేసిన అతను.. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో కూడా భారీ షాట్ ఆడబోయి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో కామెరూన్ గ్రీన్ మళ్లీ క్రీజులోకి వచ్చాడు.

కిషన్ లేకపోవడం, వధీర తేలిపోవడం, రోహిత్ ఫెయిలవడం చూసిన అభిమానులు ముంబై ఇక ఇంటికే అనుకున్నారు. ఇలాంటి సమయంలో తిలక్ వర్మ ఇన్నింగ్స్ వారిలో ఆశలు పుట్టించింది. అతని ఆటతోనే ఈ మ్యాచ్‌లో ముంబై మళ్లీ పోటీలోకి వచ్చిందని చెప్పొచ్చు. మరి తిలక్ వర్మ ఇచ్చిన మొమెంటంను మిగతా బ్యాటర్లు ఎలా కొనసాగిస్తారో చూడాలి.

Story first published: Friday, May 26, 2023, 23:06 [IST]
Other articles published on May 26, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+