Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MIvsGT : గిల్ ధమాకా.. మూడో సెంచరీతో చెలరేగిన గుజరాత్ ఓపెనర్!

ముంబైతో జరుగుతున్న రెండో క్వాలిఫైయర్‌లో గుజరాత్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అదరగొట్టాడు. ఆరంభం నుంచే కమాండింగ్ క్రికెట్ ఆడిన అతను ఈ సీజన్‌లో మూడో సెంచరీ సాధించాడు. కీలకమైన ఈ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగాడు. ఈ ఇన్నింగ్స్ ఆరంభంలో అతనికి దక్కిన జీవనదానాన్ని అద్భుతంగా యూజ్ చేసుకున్నాడు.

ఈ మ్యాచ్ ఆరంభంలోనే గిల్ లాంగాన్ వైపు ఆడిన బంతి గాల్లోకి లేచింది. వేగంగా స్పందించిన టిమ్ డేవిడ్ ముందుకు డైవ్ చేసి క్యాచ్ అందుకున్నాడు. అయితే ల్యాండింగ్ సమయంలో అతను తడబడటంతో బంతి అతని చేతుల్లో నుంచి కింద పడిపోయింది. దీంతో గిల్ బతికిపోయాడు. ఆ తర్వాత కాసేపటికే మరో భారీ షాట్ ఆడేందుకు గిల్ ప్రయత్నించాడు.

Shubman Gill

లెగ్ సైడ్ గాల్లోకి లేచిన బంతి.. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న తిలక్ వర్మకు సరిగ్గా అడుగు దూరంలో స్టెప్ పడింది. ఈ ఛాన్స్‌ను ముంబై మిస్ చేసుకుంది. అనంతరం కుమార్ కార్తికేయ బౌలింగ్‌లో కూడా గిల్ దాదాపు అవుటయ్యే వాడే. కార్తికేయ వేసిన బంతిని ముందుకొచ్చి ఆడబోయిన అతను.. టైమింగ్ మిస్సయ్యాడు.

దీంతో బాటమ్ ఎడ్జ్ తీసుకున్న బంతి వెనక్కు వెళ్లింది. అది నెమ్మదిగా వికెట్ల వద్దకు వస్తున్న సమయంలో ఇషాన్ కిషన్.. ఆ బంతితో వికెట్లను కూల్చే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే వెనక్కు తిరిగిన గిల్ చటుక్కున బ్యాటును క్రీజులో ఉంచాడు. ఆ టైట్ ఛాన్స్ కూడా ముంబై మిస్ చేసుకుంది. ఆ తర్వాత 32 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు గిల్.

ఆ తర్వాత ఏమాత్రం వెనక్కు తిరిగి చూసుకోలేదీ గుజరాత్ ఓపెనర్. ఎడాపెడా బౌండరీలు బాదేస్తూ చెలరేగాడు. ఈ క్రమంలో కేవలం 49 బంతుల్లోనే మరో సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఇది గిల్ ఆడిన చివరి నాలుగు మ్యాచుల్లో మూడో సెంచరీ కావడం గమనార్హం. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో మాత్రమే గిల్ సెంచరీ చేయలేదు. అలాగే ఒక సీజన్‌లో అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ల జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు.

Story first published: Friday, May 26, 2023, 21:37 [IST]
Other articles published on May 26, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+