Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MIvsGT : గిల్ సూపర్ సెంచరీ.. ముంబై ముందు భారీ టార్గెట్!

ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న రెండో క్వాలిఫైయర్‌లో గుజరాత్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అదరగొట్టాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో తనకు దక్కిన జీవనదానాన్ని అద్భుతంగా ఉపయోగించుకున్నాడు. వ్యక్తిగత స్కోరు 30 పరుగుల వద్ద ఉన్నప్పుడు గిల్ ఇచ్చిన క్యాచ్‌ను టిమ్ డేవిడ్ జారవిడిచాడు.

ఆ తరవాత గిల్ ఏమాత్రం వెనక్కు తిరిగి చూడలేదు. కేవలం 32 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ధనాధన్ షాట్లతో 49 బంతుల్లోనే సెంచరీ పూర్తిచేశాడు. అప్పుడు కూడా ఏమాత్రం ఆగలేదు. ఎడాపెడా బౌండరీలు బాదేశాడు. చివర్లో ఆకాష్ మధ్వాల్ వేసిన బంతికి మరో భారీ షాట్ ఆడబోయి అవుటయ్యాడు.

Shubman Gill smashes a great century

ఈ మ్యాచ్‌లో గిల్ కేవలం 60 బంతుల్లోనే 129 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఇన్నింగ్స్ ఆరంభంలోనే వృద్ధిమాన్ సాహా (18) అవుటైనా కూడా.. గిల్‌కు సాయి సుదర్శన్ (43) చక్కటి సహకారం అందించాడు. ఎక్కువగా స్ట్రైక్ రొటేట్ చేస్తూ.. గిల్‌కు ఎక్కువ బంతులు ఎదుర్కొనే అవకాశం కల్పించాడు. దీంతో గిల్ కూడా రెచ్చిపోయాడు.

చివర్లో భారీ షాట్లు ఆడేందుకు రషీద్ ఖాన్‌ (5 నాటౌట్)ను బరిలో దించాలని అనుకున్న గుజరాత్ మేనేజ్‌మెంట్.. సాయిని రిటైర్డ్ హర్ట్‌గా వెనక్కు పిలిచింది. దీంతో చివరి ఓవర్ తొలి బంతికి అతను మైదానం వీడాడు. ఆ ఓవర్లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా (28 నాటౌట్) భారీ షాట్లు ఆడాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ జట్టు మూడు వికెట్లు కోల్పోయి 233 పరుగులు భారీ స్కోరు చేసింది.

ముంబై బౌలర్లలో జేసన్ బెహ్రెండాఫ్ ఒక్కడే ఫర్వాలేదనిపించాడు. వికెట్లేమీ తీయకపోయినా నాలుగు ఓవర్లలో కేవలం 28 పరుగులే ఇచ్చాడు. అతని తర్వాత కుమార్ కార్తికేయ 2 ఓవర్లలో 15 పరుగులు ఇచ్చాడు. ఇక మిగతా బౌలర్లు అందరూ 11పైగా ఎకానమీతో బౌలింగ్ చేశారు. క్రిస్ జోర్డాన్, ఆకాష్ మధ్వాల్ ఇద్దరూ దారుణంగా తేలిపోయారు. మధ్వాల్, చావ్లా మాత్రమే చెరో వికెట్ తీసుకున్నారు. మిగతా వాళ్లు వికెట్లు కూడా తీయలేదు.

Story first published: Friday, May 26, 2023, 22:21 [IST]
Other articles published on May 26, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+