Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MIvsGT : ఫైనల్ బెర్తు కోసం హోరాహోరీ.. వర్షం కీలక పాత్ర.. ఫైనల్ చేరేది ఎవరు?

రెండో క్వాలిఫైయర్‌లో గుజరాత్‌ను ఢీ కొట్టేందుకు ముంబై ఇండియన్స్ రెడీ అయింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. మ్యాచ్ ఆరంభానికి ముందు వర్షం పడటంతో టాస్ ఆలస్యమైంది. తర్వాత రోహిత్ టాస్ గెలిచాడు. తాము ముందుగా బౌలింగ్ చేస్తామని రోహిత్ చెప్పాడు.

'వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకున్నాం. పిచ్ కూడా కొంత స్టిక్కీగా కనిపిస్తోంది. మ్యాచ్ జరిగే కొద్దీ పిచ్ మెరుగవుతుందని అనుకుంటున్నా. అన్నిటి కన్నా ముఖ్యంగా మా ముందు ఒక లక్ష్యం ఉంటే మా వాళ్లు కంఫర్ట్‌గా ఫీల్ అవుతారు. చెన్నైలో అక్కడి పరిస్థితులకు తగ్గట్లు మేం ముందుగా బ్యాటింగ్ చేశాం. ఇక్కడ పరిస్థితి వేరు. ఒక జట్టుగా మేం చాలా సవాళ్లు ఎదుర్కొని ఇక్కడి వరకు వచ్చాం' అని రోహిత్ వివరించాడు.

IPL 2023 second qualifier between Mumbai and Gujarat

అలాగే తమకు ఇది మరొక గేమ్ అని, ఈ మ్యాచ్‌లో కూడా మంచి ప్రదర్శన చేస్తామని ఆశిస్తున్నామని చెప్పాడు. 'మా కుర్రాళ్లు కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. మేం ఛేజింగ్ ఎంచుకోవడానికి అది కూడా ఒక కారణమే' అని తెలిపాడు. తమ జట్టులో ఒకే ఒక మార్పు చేసినట్లు తెలిపాడు. హృతిక్ షోకీన్ స్థానంలో కుమార్ కార్తికేయ ఆడుతున్నట్లు వెల్లడించాడు.

వర్షాన్ని దృష్టిలో పెట్టుకొని, టాస్ గెలిచి ఉంటే తాము కూడా ఛేజింగ్ తీసుకునే వాళ్లమని గుజరాత్ సారధి హార్దిక్ పాండ్యా చెప్పాడు. 'పిచ్ బాగానే కనిపిస్తోంది. గ్రూప్ స్టేజ్ ఎలా గడిచినా కూడా.. ప్లేఆఫ్స్ చాలా బాగా ఉంటాయని మనం అందరం చూశాం. ఈ క్షణాన్ని ఎంజాయ్ చేయడం ముఖ్యం. మా కుర్రాళ్లు అందరూ మోటివేట్ అయి ఉన్నారు' అని హార్దిక్ తెలిపాడు.

'ఈ గ్రౌండ్ గురించి నాకు బాగా తెలుసు. ఇక్కడ ప్రేక్షకులు మాకు ఎంత సపోర్ట్ ఇస్తారూ కూడా తెలుసు. ఈ మద్దతు అద్భుతంగా ఉంటుంది. ఈ రోజు నేను కూడా బౌలింగ్ చేస్తా. మా టీంలో రెండు కీలకమైన మార్పులు చేశాం. దాసున్ షనక స్థానంలో జోష్ లిటిల్, నల్కండే స్థానంలో సాయి సుదర్శన్ ఆడుతున్నారు' అని వెల్లడించాడు.

ముంబై ఇండియన్స్ టీం: ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ (కెప్టెన్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, క్రిస్ జోర్డాన్, పీయూష్ చావ్లా, జేసన్ బెహ్రెండాఫ్, కుమార్ కార్తికేయ, ఆకాష్ మధవాల్

గుజరాత్ టీం: వృద్ధిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహమ్మద్ షమీ

Story first published: Friday, May 26, 2023, 20:12 [IST]
Other articles published on May 26, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+