MIvsGT : మధవాల్‌ను బ్యాన్ చేశారు.. షాకింగ్ విషయం వెల్లడించిన అన్నయ్య!
ఈ ఏడాది ఐపీఎల్‌లో అందరి కన్నా వీక్ బౌలింగ్ ఎటాక్ ఉన్న జట్టు ముంబై ఇండియన్స్. గాయం వల్ల బుమ్రా లేడు. జోఫ్రా ఆర్చర్ కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక చివర్లో అతను కూడా జట్టుకు దూరమయ్యాడు. ఇలాంటి సమయంలో ఆ జట్టు ప్లేఆఫ్స్ చేరడమే కష్టం అని అంతా అనుకున్నారు. ఆర్సీబీ తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ఓడిపోవడంతో ప్లేఆఫ్స్ చేరింది.
లక్నోతో తొలి క్వాలిఫైయర్‌లో ఆ జట్టు గెలవడం కష్టమే అని భావించారు. అయితే బలహీనం అని అంతా అనుకున్న బౌలింగ్‌లోనే ముంబై చెలరేగింది. ముఖ్యంగా యువ పేసర్ ఆకాష్ మధవాల్ కేవలం ఐదు పరుగులే ఇచ్చి ఐదు వికెట్లు తీసి అదరగొట్టాడు. దీంతో అందరూ అతన్ని తెగ మెచ్చుకుంటున్నారు.

ఈ క్రమంలో మధవాల్ గురించి అతని బ్రదర్ ఆకాష్ ఆసక్తికర అంశాలు చెప్పాడు. 'రోహిత్ తన ప్లేయర్లకు చాలా అవకాశాలు ఇస్తాడు. తన టీంలోని వాళ్లను బలంగా నమ్ముతాడు. ఒక టీంలో కొత్త కుర్రాడు ఎవరున్నా సరే తన స్థానం పదిలంగా ఉంటుందో లేదో? అని టెన్షన్ పడటం సహజం. ఆ భయాన్ని రోహిత్ పోగొట్టాడు. అందుకే ఆకాష్ ఇప్పుడు అదరగొడుతున్నాడు' అని అభిప్రాయపడ్డాడు.
ఆకాష్ టెన్షన్స్‌లో సగం రోహిత్ తీసేసుకున్నాడని, వాళ్ల మధ్య బంధం చూస్తేనే అది అర్థం అవుతోందని అన్నాడు. అంతేకాదు, ఆకాష్‌ను తమ ఊర్లో ఎవరూ క్రికెట్ ఆడనివ్వరని షాకింగ్ విషయం చెప్పాడు. అతన్ని లోకల్ లీగ్స్‌లో బ్యాన్ చేశారని వెల్లడించాడు. దీంతో అతను రూర్కీలో పుట్టినా కూడా.. బయటకు వెళ్లి క్రికెట్ ఆడేవాడని తెలిపాడు.
'మా ఊళ్లో ఎవరూ ఆకాష్‌ను ఆడినిచ్చే వాళ్లు కాదు. అతను బౌలింగ్ వేస్తాడని వాళ్లకు భయం. అందుకే అతన్ని లోకల్ లీగ్స్‌లో ఒక విధంగా బ్యాన్ చేశారు. దీంతో ఆకాష్ రూర్కీ బయటకు వెళ్లి అక్కడ ఆడాల్సి వచ్చేది' అని చెప్పుకొచ్చాడు. సరైన టైంలో ఫామ్ అందుకున్న మధవాల్.. గుజరాత్‌పై కూడా చెలరేగుతాడని ముంబై ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications