MIvsGT : ముంబై ఓటమికి కారణాలివే.. ఆ రెండు ఘటనలు జరగకపోతే మ్యాచ్ ముంబైదే..!
ముంబైతో జరిగిన రెండో క్వాలిఫైయర్‌లో గుజరాత్ అదరగొట్టింది. అన్ని విభాగాల్లో చెలరేగిన ఆ జట్టు అద్భుత విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టుకు ఆ టీం ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (129) భారీ స్కోరు అందించాడు. అతని సూపర్ ఇన్నింగ్స్‌కు సాయి సుదర్శన్ (43) మంచి సహకారం అందించాడు.
వీళ్లిద్దరితోపాటు కెప్టెన్ పాండ్యా (23 నాటౌట్) రాణించడంతో ఆ జట్టు 233 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్ష్య ఛేదనలో ముంబై తడబడింది. టాపార్డర్ దారుణంగా విఫలమైంది. సూర్యకుమార్ యాదవ్ (61), తిలక్ వర్మ (43), కామెరూన్ గ్రీన్ (30) మాత్రమే ఫర్వాలేదనిపించారు. మిగతా అందరూ తేలిపోవడంతో ఆ జట్టు 177 పరుగులకే చాపచుట్టేసింది.

ఈ ఓటమితో గుజరాత్ వరుసగా రెండోసారి ఐపీఎల్ ఫైనల్ చేరిన జట్టుగా ఘనత సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో రెండు ఘటనలు జరగకపోయి ఉంటే ముంబై ఈజీగా గెలిచేదని ఫ్యాన్స్ అంటున్నారు. వాటిలో ఒకటి గిల్ ఇచ్చిన క్యాచ్‌ను టిమ్ డేవిడ్ జారవిడవడం. వ్యక్తిగత స్కోరు 30 వద్ద గిల్ ఇచ్చిన క్యాచ్‌ను టిమ్ డేవిడ్ అందుకోలేకపోయాడు.
డైవ్ చేసి క్యాచ్ అందుకున్నా.. ల్యాండింగ్‌లో బంతి అతని చేయి జారింది. దీంతో బతికిపోయిన గిల్ ఏకంగా 129 పరుగులు చేశాడు. ఇక ముంబైని కష్టాల్లోకి నెట్టిన రెండో ఘటన ఆ టీం బౌలర్ క్రిస్ జోర్డాన్ వల్ల జరిగింది. 15వ ఓవర్ వేసిన తర్వాత మొఖం తుడుచుకుంటూ ముందుకు వెళ్తున్న అతను.. చూసుకోకుండా ఇషాన్ కిషన్‌ను ఢీకొట్టాడు.
ఈ సమయంలో జోర్డాన్ భుజం వెళ్లి కిషన్ కంటి సమీపంలో తగిలింది. దీంతో అతను నొప్పిత బాధ పడ్డాడు. ఈ కారణంగా కిషన్ మైదానం వీడాల్సి వచ్చింది. అంతేకాదు, ఛేజింగ్‌లో అతను బ్యాటింగ్‌కు కూడా రాలేదు. కిషన్ బ్యాటింగ్‌కు వచ్చి ఉంటే ఈ బ్యాటింగ్ పిచ్‌పై ముంబైకి మంచి ఆరంభం దక్కేదని ఫ్యాన్స్ అంటున్నారు.

ఈ రెండు ఘటనలు జరగడం వల్లనే ముంబై ఓడిందని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఏదేమైనా ఈ రెండు ఘటనలు ముంబై విజయావకాశాలను బాగా దెబ్బతీశాయని అనడంలో మాత్రం ఎలాంటి పొరపాటు లేదు. కిషన్ స్థానంలో ఓపెనర్‌గా వచ్చిన వధీర విఫలం అవడం, రోహిత్ కూడా ఫెయిల్ అవడంతో ముంబై టీంపై చాలా భారం పడింది.
ఇలాంటి సమయంలో కాసేపు తిలక్ వర్మ అద్భుతమైన ఆటతీరుతో అభిమానుల్లో ఆశలు పెంచాడు. కానీ రషీద్ ఖాన్ బౌలింగ్‌లో అతను అవుటవడంతో ముంబై ఆశలు ఆవిరయ్యాయి. హాఫ్ సెంచరీ చేసినా కూడా సూర్యకుమార్ బ్యాటింగ్ అంత విధ్వంసకరంగా సాగలేదు. సిక్సర్లు బాదడానికి అతను కష్టపడినట్లే కనిపించింది. ఇక సూర్య, గ్రీన్ భాగస్వామ్యం విడిపోవడంతో ముంబై ఓటమి ఖరారైంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications