Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MIvsGT : ఇషాన్ కిషన్‌కు గాయం.. ముంబై పేసర్‌పై మండిపడుతున్న ఫ్యాన్స్!

గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న రెండో క్వాలిఫైయర్ మ్యాచ్‌లో ముంబైకి గట్టి దెబ్బ తగిలింది. శుభ్‌మన్ గిల్ అద్భుత సెంచరీతో చెలరేగిన సమయంలోనే ముంబై కీపర్ ఇషాన్ కిషన్‌కు దెబ్బ తగిలింది. దీనికి కారణం ఎవరో కాదు.. ముంబై పేసర్ క్రిస్ జోర్డాన్. ఈ మ్యాచ్‌లో గుజరాత్ బ్యాటర్లను కట్టడి చేయడంలో జోర్డాన్ దారుణంగా విఫలమయ్యాడు.

ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన జోర్డాన్ కేవలం ఒక్క వికెట్ కూడా లేకుండా 56 పరుగులు ఇచ్చాడు. జోర్డాన్ బౌలింగ్‌లో గిల్ భారీ షాట్లతో అదరగొట్టాడు. ఈ క్రమంలోనే ముందుకు చూడకుండా వచ్చేసిన జోర్డాన్.. ఇషాన్ కిషన్‌ను ఢీకొట్టాడు. అతని భుజం వెళ్లి కిషన్ కంటిపై తగిలింది. దీంతో కిషన్ నొప్పితో విలవిల్లాడాడు. ఈ క్రమంలోనే కన్ను నొక్కుకుంటూ పెవిలియన్‌కు వెళ్లిపోయాడు.

Ishan Kishan

కిషన్‌కు గాయం అవడంతో అతని స్థానంలో గుజరాత్ ఇన్నింగ్స్ 15వ ఓవర్ నుంచి విష్ణు వినోద్ కీపింగ్ చేశాడు. ఇది చూసిన ఫ్యాన్స్ అందరూ జోర్డాన్‌పై మండి పడుతున్నారు. 'బౌలింగ్‌లో ఏం చెయ్యలేదు. ఇప్పుడు సొంత టీం వాళ్లే ఆడకుండా చేస్తున్నాడు' అంటూ తిడుతున్నారు. అసలు ఇషాన్ మళ్లీ ఓపెనింగ్ చేయడానికి వస్తాడా? అని కొందరు అనుమానిస్తున్నారు.

జోర్డాన్ ఈ జట్టులో అసలు వేస్ట్ అని, ప్రత్యర్థి జట్టుకు 12వ ఆటగాడిగా మారాడని కొందరు మండిపడుతున్నారు. ఆర్చర్ స్థానంలో జట్టులోకి వచ్చినప్పటి నుంచి జోర్డాన్ ఈ జట్టు కోసం ఏమీ చేయలేదని, ఇదిగో ఇలా సొంత ఆటగాళ్లను దెబ్బకొడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఈ మ్యాచ్ జోర్డాన్‌కు ఏమాత్రం కలిసి రాలేదని మరికొందరు అంటున్నారు.

బ్యాటింగ్‌కు సహకరిస్తున్న ఈ పిచ్‌పై కిషన్ కనుక ఓపెనింగ్ చేయకపోతే ముంబైకి అది పెద్ద ఎదురు దెబ్బ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కిషన్ ఇచ్చే విధ్వంసకర ఓపెనింగ్ ఈ ఛేజ్‌లో ముంబైకి చాలా కీలకం అవుతుందని అంటున్నారు. మరి గాయంతో మైదానం వీడిన కిషన్ ఓపెనింగ్ చేస్తాడో లేదో చూడాలి.

Story first published: Friday, May 26, 2023, 22:04 [IST]
Other articles published on May 26, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+