Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MIvsGT : డిఫెండింగ్ ఛాంపియన్‌ను చిత్తు చేసే సత్తా ముంబైకి ఉందా?

ఐదుసార్లు ఐపీఎల్ గెలిచిన ముంబై ఇండియన్స్, డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ జట్లు కీలకమైన పోరుకు రెడీ అవుతున్నాయి. ఈ రెండు టీమ్స్ చివరి మ్యాచుల్లో అనూహ్యమైన ఫలితాలు పొందాయి. చివరి మ్యాచ్‌లో కచ్చితంగా ఓపోతుందని అనుకున్న గురాత్ టైటాన్స్.. ఎవరూ ఊహిచని విధంగా చివరి ఓవర్లో విజయం సాధించింది. అదే సమయంలో ముంబై తమ చివరి మ్యాచ్‌లో గెలిచేలా కనిపించి చివరకు ఓటమిపాలైంది..

పంజాబ్ కింగ్స్‌తో తలపడిన ముంబై జట్టు బౌలింగ్ తడబడింది.. ఈ మ్యాచ్‌లో తొలుత బౌలింగ్ చేసిన ముంబై చివరి ఓవర్లో ఏమీ చేయలేక చేతులు ఎత్తేసింది. బిగ్ హిట్టర్ టిమ్ డేవిడ్ క్రీజులో ఉన్నా కూడా గెలవలేకపోయింది. అయితే సూర్యకుమార్ యాదవ్, కామెరూన్ గ్రీన్, రోహిత్ శర్మ మళ్లీ ఫామ్ అందుకోవడం ఆ జట్టుకు బాగా కలిసొచ్చే అంశం. ముంబై బౌలింగ్ మాత్రం అనుకున్నంత ప్రమాదకరంగా లేదు. జోఫ్రా ఆర్చర్ తిరిగొచ్చినా అతని బౌలింగ్ ఆప్ష్సన్స్ ఎలా ఉన్నాయో మరి.

MIvsGT Today IPL Match can GT defeat in form MI

ఇక గుజరాత్ టైటాన్స్ అద్భుతమైన బౌలింగ్‌తో ఓడిపోయింది అనుకున్న మ్యాచ్‌లో విజయం సాధించింది. స్వల్ప లక్ష్య ఛేదనలో కేఎల్ రాహుల్ సేన తడబడింది. అదే సమయంలో మహమ్మద్ షమీ, మోహిత్ శర్మ సూపర్ బౌలింగ్‌తో గుజరాత్‌ను గెలిపించారు. అసలు ఈ మ్యాచ్ గెలుస్తామనే తాము ఊహించలేదని హార్దిక్ చెప్పాడు. ముంబైతో మ్యాచ్‌లో కూడా అదే జోరు కొనసాగించాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు

డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఉన్న గుజరాత్.. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధధించి ప్లేఆఫ్స్‌కు మరింత చేరువ కావాలి .అదే సమయంలో ఇప్పుడిప్పుడే విజయాల బాట పడుతన్న ముంబై కూడా తమ టీంను ఎలాగైనా ప్లేఆఫ్స్ తీసుకెళ్లాలని కలలు కంటోంది. జోఫ్రా ఆర్చర్ సహా ముంబై బౌలింగ్ యూనిట్ అంత గొప్పగా లేదు. పీయూష్ చావ్లా మాత్రమే ప్రభావం చూపుతున్నాడు.

బెహ్రెండాఫ్, ఆర్చర్ వంటి వాళ్లు ఏదో ఒక ఓవర్లో అయినా భారీగా పరుగులు ఇచ్చేస్తున్నారు. అదే సమయంలో చిన్న లక్ష్యాలను కూడా మోహిత్, షమీ కాపాడేస్తున్నారు. ఇలా ఒక్కో విభాగం ప్రకారం చూసుకున్నా.. ముంబై కన్నా గుజరాత్ చాలా మెరుగైన స్థితిలో కనిపిస్తోంది. మరి ఈ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే విజయావకాశాలు మాత్రం హార్దిక్ పాండ్యా టీంకే అని విశ్లషకులు అంటున్నారు.

Story first published: Tuesday, April 25, 2023, 13:55 [IST]
Other articles published on Apr 25, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+