Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MIvsCSK : సచిన్ రికార్డు బద్దలు కొట్టిన తెలుగు కుర్రాడు..!

ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్న తెలుగు కుర్రాడు తిలక్ వర్మ ఆ జట్టులో ఎంత కీలకమైన ఆటగాడిగా ఎదిగాడో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ముంబై ఈ ఐపీఎల్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లో తిలక్ వర్మనే ఆ జట్టు పరువు నిలబెట్టాడు. ఆర్సీబీతో జరిగిన ఆ మ్యాచ్‌లో కనీసం వంద పరుగులు కూడా చేసేలా లేదని అనిపించిన ముంబైకి మంచి స్కోరు అందించాడు.

చెన్నైతో వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో కూడా తిలక్ ఫర్వాలేదనిపించాడు. సూర్యకుమార్ యాదవ్ (1) అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన అతను.. 18 బంతుల్లో 22 పరుగులు చేశాడు. అనంతరం జడేజా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో ఐపీఎల్‌లో రోహిత్ శర్మ, సచిన్ టెండూల్కర్ రికార్డులను కూడా ఈ తెలుగోడు బద్దలు కొట్టాడు.

tilak varma breaks sachin record

ముంబై ఇండియన్స్ తరఫున అత్యంత వేగంగా 500 పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో తిలక్ వర్మ ఐదో స్థానానికి చేరాడు. అతను కేవలం 16 ఇన్నింగ్సుల్లోనే 500 పరుగులుు పూర్తిచేశాడు. ఇదే ఫీట్ సాధంచడానికి సచిన్ టెండూల్కర్‌కు 19 ఇన్నింగ్సులు పట్టింది. ఇక ముంబై కెప్టెన్ రోహిత్ శర్మకు ఏకంగా 21 ఇన్నింగ్సులు పట్టడం గమనార్హం. ఈ జాబితాలో వెస్టిండీస్ సుపర్ ప్టేయర్ లెండిల్ సిమన్స్ (12) అందరి కన్నా ముందు ఉన్నాడు.

ఆ తర్వాతి స్థానంలో సనత్ జయసూర్య, సూర్యకుమార్ యాదవ్, క్వింటన్ డీకాక్ ఉన్నారు. వీళ్లు ముగ్గురూ కూడా 15 ఇన్నింగ్సుల్లో 500 పరుగులు చేశారు. జాయింట్ సెకండ్ ప్లేస్‌లో ఉన్నారీ ముగ్గురూ. మూడో స్థానంలో తిలక్ వర్మ ఉండగా.. నాలుగో ప్లేస్‌లో అంబటి రాయుడు (18) ఉన్నాడు. గతేడాది నుంచి ముంబై బ్యాటింగ్ లైనప్‌లో తిలక్ వర్మ ఎంత కీ రోల్ పోషిస్తున్నాడో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. గత ఐపీఎల్ సీజన్‌లో కూడా మిగతా బ్యాటర్లు అందరూ విఫలమైనా తను మాత్రం ఒంటరి పోరాటం చేసిన సంగతి తెలిసిందే.

Story first published: Sunday, April 9, 2023, 11:53 [IST]
Other articles published on Apr 9, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+