Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MIvsCSK : తిలక్ వర్మను పక్కన పెట్టేసిన కారణం అదే: రోహిత్ శర్మ

ఐపీఎల్‌లో మరో బ్లాక్ బస్టర్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లు మైదానంలో తలపడేందుకు రెడీ అయ్యాయి. చెపాక్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌ రెండు జట్లకు కీలకమే. ఇప్పటికే ఐపీఎల్ సీజన్ సగం ముగియడంతో ప్లే ఆఫ్స్ చేరాలంటే ప్రతి జట్టుకు ఇక్కడి నుంచి జరిగే ప్రతి మ్యాచ్ ముఖ్యమే.

ఈ క్రమంలోనే రెండు జట్లు గెలిచి రెండు పాయింట్లు సాధించాలని అనుకుంటున్నాయి. ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ ఓడిపోయాడు. తాము ముందుగా బౌలింగ్ చేస్తామని చెన్నై సారధి ఎంఎస్ ధోనీ చెప్పాడు. ఇక్కడ వర్షం పడే అవకాశం ఉండటం, అలాగే పిచ్ పరిస్థితిన దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ధోనీ వెల్లడించాడు.

 rohiththilakvarma

ఇప్పటి వరకు తమ క్యాంపెయిన్‌లో ఒక్కో మ్యాచ్‌లో ఒక్కో ప్లేయర్ రాణించాడని, కానీ ఒక జట్టుగా అందరు ఆటగాళ్లు మైదానంలో మరింత ఫోకస్‌గా ఆడాల్సి ఉందని ధోనీ చెప్పాడు. చిన్న చిన్న పొరపాట్లు చేసినా కూడా అందరూ మ్యాచ్ మ్యాచ్‌కూ మెరుగవుతున్నారని మెచ్చుకున్నాడు. ఇప్పుడు ఐపీఎల్ రెండో సగంలో మ్యాచ్‌లు ముగించడం మరింత కీలకమని చెప్పిన ధోనీ.. తమ జట్టులో ఎలాంటి మార్పులు లేకుండానే బరిలో దిగుతున్నట్లు తెలిపాడు.

ప్రస్తుతం ముంబై ఇండియన్స్ మళ్లీ విజయాల బాట పట్టిందని, మొమెంటం తమవైపే ఉందని రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. తమ జట్టులో కొన్ని బలహీనతలు ఉన్నాయని, వాటిపై తాము ఫోకస్ పెట్టామని చెప్పాడు. ఐపీఎల్‌లో చాలా మంది ఆటగాళ్లు జట్టుతో చేరతారని, పరిస్థితులకు తగ్గట్లు వారిలో బెస్ట్ ఆటగాళ్లను ఆడించడం ఒక సవాల్ అని రోహిత్ అన్నాడు.

తమ జట్టులో ఈ మ్యాచ్ కోసం రెండు కీలక మార్పులు చేసినట్లు రోహిత్ వెల్లడించాడు. కుమార్ కార్తికేయ స్థానంలో రాఘవ్ అరంగేట్రం చేస్తున్నాడని తెలిపాడు. అలాగే ప్రాక్టీస్ సమయంలో తిలక్ వర్మకు చిన్న గాయమైందని, దీంతో అతని స్థానంలో స్టబ్స్ ఆడుతున్నట్లు వెల్లడించాడు.

ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, ట్రిస్టియన్ స్టబ్స్, నేహాల్ వధీర, టిమ్ డేవిడ్, అర్షద్ ఖాన్, జోఫ్రా ఆర్చర్, పీయూష్ చావ్లా, ఆకాష్ మంధ్వాల్,

చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్య రహానే, మొయీన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ, దీపక్ చాహర్, మతీష్ పతిరాణా, తుషార్ దేశ్‌పాండే, మహీష్ తీక్షణ

Story first published: Saturday, May 6, 2023, 15:42 [IST]
Other articles published on May 6, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+