చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై టాపార్డర్ తేలిపోయారు. ఎప్పుడూ ఓపెనర్‌గా వచ్చే రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో తను రాకుండా.. ఆసీస్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ (6)ను పంపించాడు. ముంబైకి ధనాధన్ ఓపెనింగ్ అందించడానికి వచ్చిన అతను.. తుషార్ దేశ్‌పాండే వేసిన ఓవర్లో బంతిని సరిగా అంచనా వేయలేక కల్ీన్ బౌల్డ్ అయ్యాడు.
దీంతో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన రోహిత్ మరోసారి విఫలమయ్యాడు. వరుసగా రెండో మ్యాచ్‌లో కూడా డకౌట్ అయ్యాడు. చివరగా పంజాబ్ కింగ్స్‌పై ముంబై గెలిచిన మ్యాచ్‌లో కూడా రోహిత్ డకౌట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సీజన్ ఆరంభం నుంచే పేలవమైన ఫామ్‌లో ఉన్న రోహిత్.. ఈ మ్యాచ్‌లో రాణిస్తాడని అభిమానులు ఆశించారు.

కానీ అభిమానులను మరోసారి నిరాశ పరిచిన రోహిత్.. మూడు బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు కూడా చెయ్యకుండానే పెవిలియన్ చేరాడు. దీపక్ చాహర్ వేసిన ఓవర్లో రోహిత్‌ను ట్రాప్ చేయడానికి ధోనీ ప్రయత్నించాడు. తను వికెట్ల దగ్గరకు వచ్చి కీపింగ్ చేశాడు. ఇది చూసిన రోహిత్.. అంతకుముందు డెలివరీలాగే చాహర్ మరో ఫుల్ లెంగ్త్ బాల్ వేస్తాడని ఆశించాడు.
దీంతో ఆ బంతిని మిడిఫ్ మీదుగా బాదేందుకు ఒక మోకాలిపై కూర్చుకున్నాడు. చాహర్ తన లెంగ్త్‌ను కొంచెం తగ్గించాడు. ఇది ఊహించని రోహిత్ వెంటనే తన షాట్ మార్చుకొని స్కూప్ ఆడేందుకు ట్రై చేశాడు. ఈ క్రమంలో అతను తడబడటంతో గాల్లోకి లేచిన బంతిని రవీంద్ర జడేజా సులభంగా అందుకున్నాడు. ఇలా రోహిత్ చెత్త షాట్ ఆడి అవుటవడం ఫ్యాన్స్‌కు ఏమాత్రం నచ్చలేదు.
అంతేకాదు, ఈ డకౌట్‌తో ఐపీఎల్ చరిత్రలోనే పరమ చెత్త రికార్డును రోహిత్ తన పేరిట రాసుకున్నాడు. అత్యధిక సార్లు డకౌట్ అయిన ప్లేయర్‌గా నిలిచాడు. ఇది ఐపీఎల్‌లో రోహిత్‌కు 16వ డకౌట్. అలాగే ఐపీఎల్‌లో కెప్టెన్‌గా అత్యధికసార్లు డకౌట్ అయినా ప్లేయర్ కూడా అతనే. ఇదంతా చూసిన ఫ్యాన్స్.. రోహిత్‌ను తెగ ట్రోల్ చేస్తున్నారు.
'నువ్వేమైనా డివిలియర్స్ అనుకున్నావా? అలాంటి షాట్లు ఆడటానికి?' అని ఎద్దేవా చేస్తున్నారు. మరికొందరేమో ఐపీఎల్‌లో అత్యధిక డకౌట్ల చరిత్ర తిరగరాసిన రోహిత్.. టీమిండియాకు కెప్టెన్ అవడం ఎంత దారుణం? అని ప్రశ్నిస్తున్నారు. ఏదేమైనా రోహిత్ కూడా కోహ్లీలా కొంత బ్రేక్ తీసుకోవడం బెటర్ అని కొందరు మాజీలు సలహా ఇస్తున్నారు.