Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

MIvRCB : హైఓల్టేజ్ మ్యాచ్‌కు రోహిత్ దూరం?.. సూర్యకు ముంబై పగ్గాలు?

ఐపీఎల్‌లో హైఓల్టేజ్ పోరుకు అంతా సిద్ధమైంది. అతిపెద్ద ఫ్యాన్ బేస్ ఉన్న రెండు జట్లు ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడేందుకు రెడీ అయ్యాయి. ఆర్సీబీ హోం గ్రౌండ్ చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. హోం క్రౌడ్ ముందు రెండేళ్ల తర్వాత జరగనున్న ఈ మ్యాచ్ హౌస్ ఫుల్ అవడం ఖాయం. దానికితోడు ఇక్కడ జరిగే మ్యాచులన్నింట్లో భారీ స్కోర్లు నమోదవుతాయి. దీంతో ప్రేక్షకులకు ఈ మ్యాచ్ పైసా వసూల్ అని చెప్పొచ్చు.

చిన్నస్వామి స్టేడియంలో పిచ్ ఎక్కువగా బ్యాటర్లకే సహకారం అందిస్తుంది. పిచ్ ఫ్లాట్‌గా ఉండటంతోపాటు స్టేడియం చిన్నది కావడంతో అలవోకగా భారీ షాట్లు కొట్టేస్తారు బ్యాటర్లు. అయితే మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు కొంత ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ స్టేడియంలో తొలి ఇన్నింగ్స్ యావరేజ్ స్కోరు 170 కాగా.. ఛేజింగ్ చేసే జట్టే ఎక్కువసార్లు గెలిచినట్లు ఈ స్టేడియం హిస్టరీ చెప్తుంది. కాబట్టి ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

rohit sharma to miss the key match 2

మ్యాచ్ జరిగే సమయంలో వాతావరణం కూడా క్లియర్‌గా ఉంటుందని, అయితే ఆకాశంలో మాత్రం మబ్బులు పట్టి ఉంటాయని వాతావరణ శాఖ అంచనా. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశమే లేదని తెలుస్తోంది. గంటకు 20-30 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, 20-35 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మ్యాచ్ జరిగే సమయంలో గాలిలో తేమ ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ హ్యుమిడిటీ 45-75 శాతం ఉంటుందట.

ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ బరిలో దిగడం అనుమానంగా మారింది. ప్రాక్టీస్ సమయంలో అనారోగ్యం పాలైన అతను.. కెప్టెన్ల మీటింగ్‌కు కూడా రాని సంగతి తెలిసిందే. దీంతో అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్‌కు జట్టు పగ్గాలు అందిస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంలో ముంబై ఇండియన్స్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. కాబట్టి రోహిత్ ఆడుతున్నాడా? లేదా? అని తెలియాలంటే మ్యాచ్ ఆరంభమయ్యే వరకు వేచి చూడక తప్పదు.

ముంబై ఇండియన్స్ జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, హృతిక్ షోకీన్, కుమార్ కార్తికేయ, జోఫ్రా ఆర్చర్, అర్షద్ ఖాన్, జేసన్ బెహ్రెండాఫ్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు (అంచనా): ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూయష్ ప్రభుదేశాయి, మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మైఖేల్ బ్రేస్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్, రీస్ టాప్లే, హర్షల్ పటేల్, మహమ్మద్ సిరాజ్

Story first published: Sunday, April 2, 2023, 12:56 [IST]
Other articles published on Apr 2, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+