Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హర్మన్‌ప్రీత్, స్మృతి వద్దు.. కెప్టెన్‌గా ఆమెకు ఛాన్స్ ఇవ్వండి: మిథాలీ రాజ్

మహిళల టీ20 ప్రపంచకప్‌-2024లో భారత జట్టు పేలవ ప్రదర్శన‌పై మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ కీలక వ్యాఖ్యలు చేసింది. పరాజయాలకు గల కారణాలు విశ్లేషిస్తూ జట్టు ఆటతీరుపై, నిర్మాణంపై మండిపడింది. మూడేళ్లుగా జట్టులో పురోగతి లేదని తెలిపింది. దుబాయ్ వేదికగా జరుగుతున్న టీ20 వరల్డ్ కప్‌లో భారత్ గ్రూప్ దశలోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే.

న్యూజిలాండ్ చేతిలో ఘోర పరాజయం, తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమితో టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మిథాలీ రాజ్ టీమిండియా ప్రదర్శన గురించి మాట్లాడింది. వచ్చే ఏడాది జరగనున్న వన్డే వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకొని జట్టును సిద్ధం చేయాలని సూచించింది. కెప్టెన్‌ను మార్చాలనుకుంటే, ఇప్పుడే కొత్త సారథిని నియమించాలని, ఆలస్యం చేస్తే మరో కప్‌కు దూరమవుతామని పేర్కొంది.

Mithali Raj Urges Harmanpreet Kaur to Step Down Not Smriti Mandhana Suggests Replacement Player

''భారత పురుషుల జట్టులో బెంచ్ సామర్థ్యాన్ని పెంచుతున్నట్లుగా మహిళల జట్టులో చేయాలి. ఆసియా కప్ వంటి టోర్నీలో బెంచ్‌పై ఉన్న ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలి. వాళ్లను సిద్ధం చేయాలి. మెగాటోర్నీల ముందు ఇది ఎంతో కీలకం. కానీ రిజర్వ్ ఆటగాళ్లు అవకాశం ఇవ్వరు. ఇది జట్టు నిర్మాణంపై ప్రభావం చూపిస్తుంది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ కచ్చితంగా నెగ్గాల్సింది. కానీ ప్రతిసారీ ఒకేలా ఆడి ఓడుతున్నాం. ఆఖరి వరకు వచ్చి విఫలమవుతున్నాం. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలో గత రెండు మూడేళ్లలో భారత్‌ ఎలాంటి ప్రగతి సాధించలేదు''

''కొత్త కెప్టెన్ నియమించాలని సెలక్టర్లు భావిస్తే యువ ప్లేయర్‌కు జట్టు పగ్గాలు అందివ్వాలి. కెప్టెన్ మార్పు ఇదే సరైన సమయం. ఆలస్యం చేస్తే మరో కప్ కోల్పోతాం. ప్రపంచకప్‌కు సమీపంలో సారథి మార్పు మంచిది కాదు, ఇప్పుడు చేస్తేనే ప్రయోజనం ఉంటుంది. వైస్ కెప్టెన్ స్మృతి మంధాన‌‌కు వద్దు. ఆమె అందుబాటులో ఉన్నప్పటికీ జెమీమా రోడ్రిగ్స్‌కు కెప్టెన్సీ అందివ్వాలి. 24 ఏళ్ల ఆమె ఎక్కువ కాలం సారథిగా కొనసాగడానికి అవకాశం ఉంటుంది'' అని మిథాలీ రాజ్ పేర్కొంది.

స్మృతి మంధానకు 28 ఏళ్లు. కాగా, 2016లో టీ20 వరల్డ్ కప్‌లో భారత మహిళల జట్టు సెమీఫైనల్స్‌కు అర్హత సాధించలేకపోయింది. ఈ దశలో మిథాలీరాజ్ నుంచి టీ20 జట్టు పగ్గాలను హర్మన్‌ప్రీత్ కౌర్ అందుకుంది. 2020 టీ20 ప్రపంచకప్‌లో జట్టును ఫైనల్‌కు చేర్చింది. కానీ విజేతగా జట్టును నిలవలేకపోయింది.

Story first published: Wednesday, October 16, 2024, 12:36 [IST]
Other articles published on Oct 16, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+