ఆరోసారి: ఫైనల్‌లో పాక్‌పై భారత్ ఘన విజయం
హైదరాబాద్: మహిళల ఆసియా కప్ టి20 టోర్నీలో భారత జట్టు హవా కొనసాగింది. లీగ్ దశ నుంచే అజేయంగా ఫైనల్‌కు చేరిన టీమిండియా ఫైనల్లోనూ అదే జోరు ప్రదర్శించింది. ఫలితంగా వరుసగా ఆరోసారి ఆసియా కప్ టీ20 ఛాంపియన్‌గా అవతరించింది.
ఆదివారం ఇక్కడ జరిగిన ఏసీసీ మహిళల టీ20 ఆసియాకప్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ 17 పరుగుల తేడాతో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తుచేసింది. 2004లో ప్రారంభమైన ఈ టోర్నీ ఇప్పటికి ఆరుసార్లు జరగ్గా, ప్రతీసారి భారత మహిళల జట్టే ఛాంపియన్‌గా అవతరించడం విశేషం.
ఆసియా కప్ ఫైనల్స్‌లో భారత్ చేతిలో పాకిస్థాన్ ఓటమి పాలవ్వడం ఇది వరుసగా రెండోసారి. నాలుగేళ్ల క్రితం 2012లో జరిగిన ఫైనల్లోనూ పాకిస్థాన్‌పై భారత్ విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు ఎంచుకున్న భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది.
మిథాలీ రాజ్ 65 బంతుల్లో 73 నాటౌట్‌తో అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టు స్కోరులో కీలకపాత్ర పోషించింది. ఓపెనర్ స్మృతి మంధాన (6)తో కలసి తొలి వికెట్‌కు 24 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసింది. ఆనమ్ అమీన్ బౌలింగ్‌లో స్మృతి కీపర్‌కు క్యాచిచ్చి పెవిలియన్ చేరింది.

మిథాలీ అద్ఫుత అర్ద సెంచరీ
ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన మేఘన (9)తో మిథాలీ స్కోరు బోర్డును ముందుకు నడిపించింది. దీంతో వీరిద్దరూ కలసి రెండో వికెట్‌కు 44 పరుగుల కీలక భాగస్వామ్యం నమోదు చేశారు. ఆ తర్వాత 68 పరుగుల జట్టు స్కోరు వద్ద మేఘన రనౌట్‌గా పెవిలియన్‌కు చేరింది. తర్వాత క్రీజులోకి వచ్చిన వేదా కృష్ణమూర్తి (2), కెప్టెన్ హర్మన్‌ప్రీత కౌర్ (5) సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేరడంతో టీమిండియా 89 పరుగలకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో భారత ఆల్ రౌండర్ జులన్ గోస్వామి మెరుపు ఇన్నింగ్స్‌తో ఆడింది.

జులన్ గోస్వామి మెరుపు ఇన్నింగ్స్
ఆమె 10 బంతులు ఎదుర్కొని రెండు సిక్సర్లతో 17 పరుగులు చేయడంతో భారత జట్టు స్కోరు 121 పరుగులు సాధించింది. వరల్డ్ టీ20లో మిథాలీ బ్యాటింగ్ విమర్శలకు గురైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు విలువైన ఇన్నింగ్స్‌తో ఆ విమర్శలకు సమాధానం చెప్పింది. ఈ క్రమంలో 43 బంతుల్లో మిథాలీ రాజ్ తన కెరీర్‌లో పదో అర్ధ సెంచరీ నమోదు చేసింది. పాకిస్థాన్ బౌలర్ అమీన్ (2/24) రాణించింది. అనంతరం 122 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ తొలి ఓవర్లోనే పది పరుగులు రాబట్టి పాకిస్తాన్ శుభారంభం చేసింది.

10 ఓవర్లకు పాక్ 3/56
అయితే వరుస ఓవర్లలో ఆయేషా (15), అస్మామియా (1) ఔట్ కావడంతో ఆ జట్టు తీవ్ర ఇబ్బందుల్లో పడింది. ఓపెనర్ ఆయేషా (15)ను జులన్ బౌల్డ్ చేయగా.. అస్మావియా ఇక్బాల్ (1)ను శిఖా పాండే తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు పంపింది. ఏక్తా బౌలింగ్‌లో జవేరి ఖాన్ (22) క్యాచ్ రూపంలో పెవిలియన్‌కు చేరడంతో 10 ఓవర్లకు గాను పాకిస్థాన్ 3 వికెట్లను కోల్పోయి 56 పరుగులు చేసింది. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్ కూడా పూర్తిగా విఫలమయ్యారు. ఆరు వికెట్లు కోల్పోయిన తర్వాత పాకిస్తాన్ చివరి 26 బంతుల్లో 40 పరుగులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

మిథాలీకి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు
ఈ క్రమంలో భారత బౌలర్లు పట్టు బిగించారు. చివర్లో నిడా దర్, సనా మిర్ కొంత ప్రతిఘటించినా అప్పటికే రన్ రేట్ బాగా పెరిగడతంతో పాకిస్థాన్ జట్టు చేతులెత్తేసింది. దీంతో పాక్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 104 పరుగులే చేసింది. భారత బౌలర్లలో స్ఫిన్నర్ ఏక్తా బిస్త్ రెండు వికెట్లు తీసుకోగా... అనూజ పటేల్, జులన్, శిఖా పాండే, ప్రీతి బోసీ తలో వికెట్ తీసుకున్నారు. ఈ టోర్నీలో మిథాలీ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్', ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్' అవార్డులను గెలుచుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications