
సచిన్ ట్వీట్‌కు మిథాలీ
సచిన్ ట్వీట్‌కు మిథాలీ "చిన్నప్పటి నుంచీ చూస్తూ పెరిగిన క్రికెట్ దిగ్గజం తనని అభినందించడం సంతోషంగా ఉంది" అని రీట్వీట్ చేసింది. అయితే, మిథాలీ రాజ్ ట్వీట్‌కు స్పందించిన సుగు అనే ఓ నెజిటన్ మిథాలీరాజ్ మాతృభాష తమిళం అయినా ఎప్పుడూ ఆ భాష మాట్లాడదని, ఇంగ్లీష్, తెలుగు, హిందీ భాషల్లోనే మాట్లాడుతుందని ట్రోల్ చేశాడు.

మిథాలీకి మాతృభాష రాదని ఎద్దేవా
అంతేకాదు మిథాలీకి అసలు మాతృభాష రాదని ఎద్దేవా చేశాడు. దీంతో సుగు ట్వీట్‌కు మిథాలీ దిమ్మదిరిగిపోయే సమాధానమిచ్చింది. "నా మాతృభాష తమిళమే. నేను ఈ భాషను బాగా మాట్లాడుతా. ఒక తమిళ వ్యక్తిగా జీవించడం గర్వపడుతున్నా. అన్నిటికన్నా ముఖ్యంగా గౌరవప్రద భారతీయురాలిగా ఉంటా. నా ప్రతీ పోస్టుకు స్పందించే మీ మాటలను సలహాలుగా తీసుకొని ముందుకుసాగుతా" అని మిథాలీ ట్వీట్ చేసింది.

ప్రపంచ క్రికెట్‌లో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న మిథాలీ
ఈ సందర్భంగా సుగుకు బాలీవుడ్ నటి టేలర్ స్విఫ్ట్ పాటను ఒకటి మిథాలీ షేర్ చేయడం విశేషం. ఇటీవలే మిథాలీ రాజ్ అంతర్జాతీయ క్రికెట్‌లో 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. మొత్తంగా ఈ ఘనత సాధించిన నాలుగో క్రికెటర్ కాగా, మహిళలల్లో తొలి క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. ఈ ఏడాది ఆరంభంలో మిథాళీ టీ20లకు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications
