For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

షారుక్, నీతా అంబానీతో కలిసి వోగ్ ముఖచిత్రంపై మిథాలీ

భారత మహిళా క్రికెట్‌ అంటే ఠక్కున గుర్తుచ్చొ పేరు మిథాలీ రాజ్. అంతలా భారత మహిళా క్రికెట్‌ను మిథాలీ రాజ్ ప్రభావితం చేసింది.

By Nageshwara Rao

హైదరాబాద్: భారత మహిళా క్రికెట్‌ అంటే ఠక్కున గుర్తుచ్చొ పేరు మిథాలీ రాజ్. అంతలా భారత మహిళా క్రికెట్‌ను మిథాలీ రాజ్ ప్రభావితం చేసింది. ప్రస్తుతం భారత మహిళా జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న మిథాలీ రాజ్ ప్రముఖ మ్యాగజైన్ వోగ్ కవర్ పేజిపై దర్శనమిచ్చింది.

వోగ్ మ్యాగజైన్ తన పదో వార్షికోత్సవ సందర్భంగా విడుదల చేసిన మ్యాగజైన్ కవర్ పేజిపై బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్, రిలయన్స్ ఫౌండేషన్ చైర్ ఫర్సన్ నీతా అంబానీతో కలిసి మిథాలీ రాజ్ దర్శనమచ్చింది. ఈ విషయాన్ని మిథాలీ తన ట్విట్టర్‌లో వెల్లడించింది.

Mithali Raj shares space with Shah Rukh Khan, Nita Ambani

ఇటీవలే మిథాలీ రాజ్ నేతృత్వంలోని భారత మహిళా జట్టు ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్‌కు వెళ్లింది. పైనల్లో ఇంగ్లాండ్ చేతిలో ఓటమిపాలై రన్నరప్‌గా నిలిచింది. అంతేకాదు అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో మిథాలీ రాజ్ అనేక రికార్డులను సృష్టించింది.

మ‌హిళ‌ల వ‌న్డే క్రికెట్‌లో అత్య‌ధిక ప‌రుగులు సాధించిన క్రికెటర్‌గా మిథాలీ చరిత్ర సృష్టించింది. ఐసీసీ ఉమెన్ వరల్డ్ కప్‌ టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో మిథాలీ ఈ ఘనత సాధించింది. అత్యధిక పరుగులతో పాటు వన్డే క్రికెట్‌లో 6,000 పరుగులు చేసిన తొలి మహిళా క్రికెటర్‌ కూడా మిథాలీనే.

16 ఏళ్ల వ‌య‌సులో 1999లో వ‌న్డేల్లో అరంగేట్రం చేసిన మిథాలీ.. ఐర్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే సెంచ‌రీ చేసింది. ఇప్ప‌టికీ అత్యంత పిన్న వ‌య‌సులో సెంచరీ చేసిన రికార్డు మిథాలీ పేరిట ఉండటం విశేషం. మహిళల క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్‌గా మిథాలీకి పేరుంది.

19 ఏళ్ల వయసులో టాంటన్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 214 పరుగులు చేసి టెస్టుల్లో రెండో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా అరుదైన గుర్తింపు సాధించింది. టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన ప్లేయర్‌గా పాకిస్థాన్‌కు చెందిన కిరన్ బలూచ్ పేరిట ఉంది.

2004లో వెస్టిండిస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కిరన్ 242 పరుగులు చేసింది. ఇదిలా ఉంటే తన 18 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో మిథాలీ రాజ్ ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. ఇటీవలే వన్డేల్లో వ‌రుస‌గా ఏడు అర్ధ సెంచ‌రీలు చేసిన తొలి క్రికెట‌ర్‌గా మిథాలీ రికార్డు సృష్టించింది.

వ‌న్డే అరంగేట్రం చేసిన త‌ర్వాత వ‌రుస‌గా 15 ఏళ్లు పాటు మిథాలీ యావరేజి 40కి పైగా ఉండటం విశేషం. స‌చిన్ కూడా స‌రిగ్గా ఇన్నేళ్ల పాటు 40కి పైగా యావరేజితో ప‌రుగులు చేయ‌డం విశేషం. 2008-12 మధ్యలో ఐదేళ్లు మిన‌హాయిస్తే 2004 నుంచి భారత మహిళల జట్టుకి మిథాలీ కెప్టెన్‌గా కొనసాగుతోంది.

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+