For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

4-5 ప్రపంచకప్‌లు ఆడినా ఒక్క ట్రోఫీని కైవసం చేసుకోలేకపోయాం.. చాలా బాధగా ఉంది: మిథాలీ

Mithali Raj said he will give her best shot at the 2021 World Cup
#TeamMaskForce : Team India Is Now Team Mask Force

హైదరాబాద్: 4-5 ప్రపంచకప్‌లు ఆడినా ఒక్క ఐసీసీ ట్రోఫీని కైవసం చేసుకోలేకపోయాం, ఇది నిజంగా చాలా బాధిస్తుంది అని భారత వన్డే మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌, సీనియర్ ప్లేయర్ మిథాలీ రాజ్‌ అన్నారు. ఇన్నేళ్లలో ఒక్క ఐసీసీ టోర్నీ టైటిల్​ కూడా సాధించకపోవడం చాలా నిరాశగా ఉందని పేర్కొన్నారు. 2021 వన్డే ప్రపంచకప్​లో మరింత మెరుగ్గా ప్రదర్శన చేసేందుకు ఇప్పటి నుంచి ప్రతిరోజూ కష్టపడుతున్నా అని మిథాలీ తెలిపారు.

చాలా నిరాశ చెందా

చాలా నిరాశ చెందా

కామెంటేటర్​ లిసా షలేకర్​తో మిథాలీ రాజ్ ఇన్​స్టాగ్రామ్ లైవ్ ద్వారా మాట్లాడి పలు విషయాలు పంచుకున్నారు. 'నేను, జులన్​ గోస్వామి కలిసి చాలా ఏళ్లు టీమిండియాకు ఆడాం. 4-5 ప్రపంచకప్​ టోర్నీల్లో బరిలోకి దిగాం. అయినా ఒక్క ఐసీసీ ట్రోఫీని కైవసం చేసుకోలేకపోయాం. ఇది నిజంగా చాలా బాధిస్తున్నది. 2021 ప్రపంచకప్​లో మరింత అత్యుత్తమ ప్రదర్శన చేయాలనుకుంటున్నా, అందుకోసం కష్టపడుతున్నా. ఇద్దరం ఫిట్‌నెస్‌పై ఎక్కువ పని చేయాల్సి ఉంటుంది' అని మిథాలీ చెప్పారు.

2017లో కంటే చురుగ్గా ఉంటా

2017లో కంటే చురుగ్గా ఉంటా

కోవిడ్ -19 సంక్షోభం త్వరలోనే తొలగిపోతుందని, న్యూజిలాండ్‌లో జరిగే మహిళల ప్రపంచకప్ వరకు భారత్ రెండు సిరీస్‌లు ఆడాలని భావిస్తున్నట్లు మిథాలీ రాజ్ అన్నారు. కరోనా వైరస్ కారణంగా జూన్​లో ప్రారంభం కావాల్సిన భారత మహిళల జట్టు.. ఇంగ్లండ్ పర్యటన వాయిదా పడింది. కరోనా లాంటి సంక్షోభం ఎవరూ ఊహించరని మిథాలీ పేర్కొన్నారు. కరోనా సమయాన్ని ఉపయోగించుకుంటా, నేను 2017లో కంటే చురుగ్గా ఉంటానని ధీమా వ్యక్తం చేసారు. మిథాలీ, జులన్ ఇప్పటికే టీ20ల నుంచి రిటైవగా.. వన్డేలపైనే పూర్తి దృష్టిసారించారు. న్యూజిలాండ్​లో వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్​ సాధించాలనే లక్ష్యంతో ఉన్నారు.

16 ఏళ్ల వ‌య‌సులో అరంగేట్రం

16 ఏళ్ల వ‌య‌సులో అరంగేట్రం

16 ఏళ్ల వ‌య‌సులో 1999లో వ‌న్డేల్లో అరంగేట్రం చేసిన మిథాలీ.. ఐర్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే సెంచ‌రీ చేసారు. ఇక 19 ఏళ్ల వయసులో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో 214 పరుగులు చేసి టెస్టుల్లో రెండో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా అరుదైన గుర్తింపు సాధించారు. 18 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో మిథాలీ ఎన్నో రికార్డులను బద్దలు కొట్టారు. ఇక వన్డేల్లో వ‌రుస‌గా ఏడు అర్ధ సెంచ‌రీలు చేసిన తొలి క్రికెట‌ర్‌గా రికార్డు సృష్టించారు.

పైనల్లో ఓటమి:

పైనల్లో ఓటమి:

వ‌న్డే అరంగేట్రం చేసిన త‌ర్వాత వ‌రుస‌గా 15 ఏళ్లు పాటు మిథాలీ యావరేజి 40కి పైగా ఉండటం విశేషం. స‌చిన్ కూడా స‌రిగ్గా ఇన్నేళ్ల పాటు 40కి పైగా యావరేజితో ప‌రుగులు చేసాడు. 2008-12 మధ్యలో ఐదేళ్లు మిన‌హాయిస్తే.. 2004 నుంచి భారత మహిళల జట్టుకి మిథాలీ కెప్టెన్‌గా ఉంది. మిథాలీ నేతృత్వంలోని భారత మహిళా జట్టు ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఐసీసీ ప్రపంచకప్ ఫైనల్‌కు వెళ్లింది. పైనల్లో ఇంగ్లాండ్ చేతిలో ఓటమిపాలై రన్నరప్‌గా నిలిచింది.

వ‌న్డే క్రికెట్‌లో అత్య‌ధిక ప‌రుగులు:

వ‌న్డే క్రికెట్‌లో అత్య‌ధిక ప‌రుగులు:

అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో మిథాలీ రాజ్ అనేక రికార్డులను సృష్టించారు. మ‌హిళ‌ల వ‌న్డే క్రికెట్‌లో అత్య‌ధిక ప‌రుగులు సాధించిన క్రికెటర్‌గా మిథాలీ చరిత్ర సృష్టించారు. మిథాలీ భారత్ తరఫున 10 టెస్టులు, 209 వన్డేలు, 89 టీ20లు ఆడారు. టెస్టులలో 663, వన్డేలలో 6888, టీ20లలో 2364 పరుగులు చేసారు.

Story first published: Friday, May 1, 2020, 19:13 [IST]
Other articles published on May 1, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+