పవార్ కోచ్ పదవికే ఎసరు?: మిథాలీతో వివాదం ఎంత పనిచేసింది


హైదరాబాద్: భారత మహిళా సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్‌తో చోటు చేసుకున్న విభేదాలు... కోచ్‌గా రమేశ్ పొవార్ రెండోసారి ఆ బాధ్యతలు చేపట్టే అవకాశాన్ని చేజార్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. టీ20 వరల్డ్ కప్‌కు ముందే బీసీసీఐ రమేశ్ పొవార్‌ను మహిళల జట్టు తాత్కాలిక కోచ్‌గా నియమించింది.
దీంతో ఆగస్టులో కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న రమేశ్ పవార్ పదవికాలం నవంబర్ 30తో ముగియనుంది. అయితే, తిరిగి రెండోసారి కోచ్‌గా రమేశ్ పొవార్ దరఖాస్తు చేసుకునే వెసులబాటు ఉన్నా.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అతడి కాంట్రాక్టును పొడిగించేందుకు బీసీసీఐ అంత సుముఖంగా లేన్నట్లు తెలుస్తోంది.

మిథాలీని తప్పిస్తూ నిర్ణయం
ఈ విషయాన్ని బీసీసీఐకి చెందిన ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. వరల్డ్ టీ20లో మంచి ఫామ్ మీదున్న మిథాలీని తప్పిస్తూ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మందాన, చీఫ్ కోచ్ రమేవ్ పవార్, సెలెక్షన్ కమిటీ సభ్యురాలు సుధాషా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై అటు ఫ్యాన్స్‌తో పాటు మాజీ క్రికెటర్లు తీవ్ర విమర్శలు గుప్పించారు.

బీసీసీఐని కలిసి వివరణ ఇచ్చిన పొవార్
ఈ వివాదంపై ఇప్పటికే బోర్డు సీఈఓ రాహుల్ జోహ్రిని మిథాలీతో పాటు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, జట్టు మేనేజర్ తృప్తి భట్టాచార్య కలిశారు. ఈ ముగ్గురూ వేర్వేరుగా జోహ్రిని కలిసి వివాదం విషయంలో తమ అభిప్రాయాలు చెప్పారు. తాజాగా మహిళల జట్టు కోచ్ రమేశ్ పవార్.. బుధవారం బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రి, జీఎం సబా కరీమ్‌లను కలిశాడు.

మిథాలీతో తనకు సరైన సంబంధాలు లేవు
ఈ సమావేశంలో మిథాలీతో తనకు సరైన సంబంధాలు లేవని కూడా అంగీకరించాడు. మిథాలీ ఓపెనింగ్‌లోనే ఆడతానని పట్టుబట్టిందని, లేదంటే ప్రపంచకప్ నుంచి తప్పుకుని, రిటైర్మెంట్ ప్రకటిస్తానని హెచ్చరించినట్లు పవార్ బోర్డుకు రాసిన నివేదికలో పేర్కొన్నాడు. మిథాలీ వ్యక్తిగత మైలురాళ్ల కోసం ఆడుతుందని, జట్టు ప్రయోజనాల గురించి పట్టించుకోదని ఆరోపించాడు.

భారత మహిళల జట్టు స్థాయిని దిగజార్చింది
వీరిద్దరి మధ్య నెలకొన్న వివాదం భారత మహిళల జట్టు స్థాయిని దిగజార్చిందని బీసీసీఐ భావిస్తోంది. అంతేకాదు, భారత మహిళల జట్టుకు సుదీర్ఘకాలం సేవలందించిన సీనియర్ క్రికెటర్ పట్ల రమేశ్ పొవార్ తీరుపై కఠినంగా వ్యవహరించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగానే రెండోసారి కోచ్ పదవికి అతను దరఖాస్తు చేసుకున్నా తిరస్కరించాలని బీసీసీఐ నిర్ణయించుకుంది.

తుషార్ అరోతె స్థానంలో ఆగస్టులో కోచ్ బాధ్యతలు
సీనియర్ క్రికెటర్లతో పొసగని తుషార్ అరోతె స్థానంలో ఆగస్టులో కోచ్ బాధ్యతలు అందుకున్న పవార్ జట్టులో అనేక మార్పులు తీసుకొచ్చాడు. తనకున్న సుదీర్ఘ అనుభవంతో మహిళా క్రికెటర్ల ఆటతీరులో మార్పుతీసుకొచ్చాడు. అప్పటి వరకు తుషార్ శిక్షణ పద్ధతులతో విసిగి వేసారిన సీనియర్లకు పవార్ రాక మంచి ఉత్సాహాన్ని నింపింది.

పవార్ కోచ్ పదవికి ఎసరు?
గెలుపొటములతో సంబంధం లేకుండా ఆత్మవిశ్వాసంతో ఆడాడంటూ పవార్ తనదైన శైలిలో మార్పుతీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. అయితే, వరల్డ్ టీ20 టోర్నీలో ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ పవార్ కోచ్ పదవికి ఎసరు తెచ్చింది. త్వరలోనే కోచ్ ఎంపిక కోసం బీసీసీఐ త్వరలోనే దరఖాస్తులు ఆహ్వానించనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications