For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కంగారూల ధాటికి భారత్ బెంబేలు, సిరీస్ చేజారినట్టే..

Mithali Raj Returns As India Women Aim To Level Series Against Australia

హైదరాబాద్: సిరీస్ గెలవాలని కొండంత ఆశతో మిథాలీ కెప్టెన్సీలో మ్యాచ్ ను మొదలుపెట్టిన భారత మహిళా జట్టుకు నిరాశే మిగిలింది. మిథాలీ సేనకు ఆస్ట్రేలియా జట్టు ఇచ్చిన టార్గెట్‌ను అందుకోలేక కూలపడిపోయింది. టాస్ ఓడిపోవడంతో ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ తీసుకోవాల్సి వచ్చింది. కంగారూల బ్యాటింగ్ ధాటిని భారత బౌలర్లు ఎంత కష్టపడినా అదుపుచేయలేకపోయారు.

ఈ నేపథ్యంలో కంగారూలు తొమ్మిది వికెట్ల నష్టానికి 287 పరుగులు చేశారు. భారత బౌలర్లు శిఖా పాండే మూడు వికెట్లను తీసి 61పరుగులు మాత్రమే ఇచ్చింది. పూనమ్ యాదవ్ 2 వికెట్లు, హర్మన్ ప్రీత్ కౌర్, ఎక్తా బిషిత్ చెరో వికెట్‌ను తీశారు.

తొలి వన్డేకు అనారోగ్యంతో మ్యాచ్‌లో ఆడలేకపోయిన మిథాలీ రెండో వన్డే ఆడి అందరి ఆశలు నీరుగార్చింది. కేవలం 15పరుగులకే పెవిలియన్ బాట పట్టింది. కాగా, స్మృతి మందాన మినహాయించి జట్టులోని ఏ ఒక్కరూ 30కి మించిన స్కోరు చేయలేకపోయారు. 288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు మ్యాచ్ ఆరంభంలో కాస్త నిలదొక్కుకునే ప్రయత్నమే చేసినా కంగారూల ధాటికి నిలవలేకపోయింది. ఇంకా నాలుగు బంతులు మిగిలి ఉండగానే 60 పరుగుల తేడాతో ఆల్ అవుట్‌కు గురై ఓటమి పాలైంది.

ఆస్ట్రేలియా బ్యాటింగ్:

భారత జట్టులో స్మృతి మంధాన 67 ఒక్కరే చెప్పుకోదగ్గ స్కోరు చేయగా.. ఆస్ట్రేలియా జట్టులో సెంచరీకి చేరువగా నికోల్ బోల్టన్ (84)పరుగులు చేసింది. ఎలిస్ పెర్రీ(70) నాటౌట్‌గా, బెత్ మోనీ (56) పరుగులతో హాఫ్ సెంచరీ చేశారు.

ఆస్ట్రేలియా జట్టుపై మూడో వన్డేను భారత జట్టు వడోదరా వేదికగా మార్చి 18న తలపడనుంది.

Story first published: Thursday, March 15, 2018, 16:46 [IST]
Other articles published on Mar 15, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+