Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Top 10 Records of Mithali Raj: భారత దిగ్గజం మిథాలీ అత్యుత్తమ 10రికార్డులివే..!

Top 10 Best Records Of Mithali Raj in womens cricket History

టీమిండియా వుమెన్స్ క్రికెట్ అంటే మిథాలీ రాజ్.. మిథాలీ రాజ్ అంటే టీమిండియా వుమెన్స్ క్రికెట్ అనేంతలా ఎనలేని క్రికెట్ సేవ చేసింది. ఇక ఈ దిగ్గజ క్రికెటర్ 16ఏళ్ల ప్రాయం నుంచి 39ఏళ్ల వరకు టీమిండియా మహిళల క్రికెట్ దిశ దశను మార్చే ప్రదర్శన కనబర్చింది. కెప్టెన్‌గా టీమిండియాను ఆమె నడిపించిన విధానం న భూతో న భవిష్యత్తు అనడంలో అతిశయోక్తి లేదు. ఇక అన్ని ఫార్మాట్ల, అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్‌కు బుధవారం మిథాలీ రిటైర్మెంట్ ప్రకటించింది. ట్విట్టర్‌లో ఈ మేరకు సుదీర్ఘ రిటైర్మెంట్ ప్రకటన పోస్ట్ చేసింది. ఇక ఇన్నేళ్లపాటు అభిమానుల నుంచి తనకు అందుతున్న ప్రేమ, మద్దతుకు మిథాలీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. ఆమె భారత్ తరఫున 232మ్యాచ్‌లు ఆడింది. 50.68సగటుతో 7805పరుగులు చేసింది. ఇక ఆమె కెరీర్లో ఎన్నో గొప్ప రికార్డులు ఉన్నాయి. అందులో ఆమె టాప్ 10 రికార్డులు ఓసారి చూద్దాం.

1. టెస్ట్‌ల్లో ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు: 2002 ఆగస్టులో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 407బంతులు ఆడి మిథాలీ రాజ్ 214పరుగులు చేసింది.

2. టెస్ట్‌ల్లో అతి చిన్న వయసులో డబుల్ సెంచరీ : 2002ఆగస్టులో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 407బంతులు ఆడి మిథాలీ రాజ్ 214పరుగులు చేసింది. అప్పుడు మిథాలీ వయసు కేవలం 19ఏళ్ల 254రోజులు మాత్రమే.

3. టెస్ట్‌ల్లో 7వ వికెట్‌కు అత్యధిక పరుగుల భాగస్వామ్యం : 2002 ఆగస్టులో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో 407బంతులు ఆడి మిథాలీ రాజ్ 214పరుగులు చేసింది. ఆ మ్యాచ్‌లో మిథాలీ 7వ వికెట్‌కు జులియన్ గోస్వామితో కలిసి 157పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఇప్పటికే అదే 7వ వికెట్‌కు అత్యుత్తమ భాగస్వామ్యం

4. లాంగెస్ట్ వన్డే కెరీర్ : అంతర్జాతీయ క్రికెట్లో (పురుషుల క్రికెట్, మహిళల క్రికెట్) అత్యధిక కాలం వన్డే కెరీర్ కొనసాగించిన ప్లేయర్‌గా మిథాలీ రాజ్ నిలిచిపోయింది. ఆమె 22 సంవత్సరాల 274రోజుల పాటు వన్డేలో తన కెరీర్ కొనసాగించింది.

5. అత్యధిక వన్డే మ్యాచ్‌లకు కెప్టెన్సీ : అంతర్జాతీయ క్రికెట్లో సుదీర్ఘకాలం పాటు టీమిండియా కెప్టెన్‌గా మిథాలీ రాజ్ కొనసాగింది. ఇక ఆమె వుమెన్స్ వన్డే క్రికెట్లో అత్యధిక మ్యాచ్‌లు ( 232 ) ఆడిన ప్లేయర్‌గానే కాకుండా అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహించిన ప్లేయర్‌గాను రికార్డులకెక్కింది. ఆమె మొత్తం 155 వన్డే మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించింది.

6. వుమెన్స్ వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు : వుమెన్స్ వన్డే క్రికెట్లో అత్యధిక మ్యాచ్‌లు ( 232 ) ఆడిన మిథాలీ రాజ్.. వన్డే క్రికెట్లో అత్యధిక పరుగులు 7805 చేసిన ప్లేయర్‌గా కొనసాగుతుంది. ఆమె తర్వాత సీఎం ఎడ్వర్డ్స్ (5992పరుగులు)తో రెండో ప్లేస్‌లో ఉంది. తొలి స్థానానికి రెండో స్థానానికి 1813పరుగుల వ్యత్యాసం ఉంది.

7. అరంగేట్రం చేసిన మ్యాచ్‌లోనే సెంచరీ : 1999లో జూన్‌లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మిథాలీ రాజ్ టీమిండియా తరఫున అరంగేట్రం చేసింది. ఆ మ్యాచ్‌లో సెంచరీ (114పరుగులు) చేసిన మిథాలీ రాజ్ కడవరకు నాటౌట్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో ఇండియా 161పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఇక ఈ మ్యాచ్‌లో సెంచరీ ద్వారా క్రికెట్లో అత్యంత చిన్న వయసులో సెంచరీ (16 ఏళ్ల 205రోజులు) చేసిన ప్లేయర్‌గానూ మిథాలీ నిలిచింది.

8. అత్యధిక సార్లు 90 ప్లస్ పరుగులు : వన్డేల్లో అత్యధిక సార్లు (5సార్లు) 90 ప్లస్ పరుగులు చేసిన ప్లేయర్‌గా మిథాలీ రాజ్ కొనసాగింది. ఇక ఆమెతో పాటు విండీస్ ప్లేయర్ ఎస్ఆర్ టేలర్ సైతం (5సార్లు) 90 ప్లస్ పరుగులు చేసిన ప్లేయర్‌గా పేరొందింది.

9. వరుసగా 7సార్లు హాఫ్ సెంచరీ చేసిన తొలి మరియు ఏకైక ప్లేయర్ : ఇక వన్డేల్లో వరుసగా 7 మ్యాచ్‌లలో హాఫ్ సెంచరీ చేసిన తొలి మరియు ఏకైక ప్లేయర్‌గా మిథాలీ రాజ్ నిలిచింది. ఆమె 2017లో వరుసగా 7 ఇన్నింగ్స్‌లలో 70 నాటౌట్, 64, 73నాటౌట్, 51నాటౌట్, 54, 62నాటౌట్, 71పరుగులు చేసింది.

10. వన్డే క్రికెట్లో అత్యధిక హాఫ్ సెంచరీలు : వన్డేల్లో అత్యధిక ఫిఫ్టీలు (64) చేసిన ప్లేయర్‌గా మిథాలీ అగ్రస్థానంలో ఉంది. అలాగే తన కెరీర్లో 7సెంచరీలు కూడా చేసింది.

Story first published: Wednesday, June 8, 2022, 17:02 [IST]
Other articles published on Jun 8, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+