'భారత్‌ను నంబర్‌వన్‌గా చూడాలనేది నా కోరిక, 2021 వరల్డ్‌కప్‌లో ఆడతా'

హైదరాబాద్: 2021 వన్డే వరల్డ్‌కప్‌లో ఆడేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు భారత మహిళల జట్టు వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ తెలిపారు. ప్రస్తుతం మిథాలీ వయసు 36 ఏళ్లు. దీంతో ఆమె ఎంతో కాలం అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగకపోవచ్చని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, మిథాలీ మాత్రం ఇంకా కొన్నాళ్లు తాను క్రికెట్‌లోనే కొసాగుతానని తెలిపారు.
ఇప్పుడే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికే ఆలోచన లేదని ఆమె అన్నారు. తాను 2021లో వన్డే వరల్డ్‌కప్‌లోనూ ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని మిథాలీ అన్నారు. ఇండియా టుడే నిర్వహించిన కాన్‌క్లేవ్‌లో మిథాలీ మాట్లాడుతూ "2021 ప్రపంచకప్‌లో ఆడేందుకు సిద్ధంగా ఉన్నా. 2017 ప్రపంచకప్ తర్వాత వన్డేల్లో భారత్ అద్భుత ప్రదర్శన చేస్తోంది" అని అన్నారు.
"గత ఆరు సిరీస్‌లలో ఐదు సిరీస్‌లను భారతే గెలిచి జట్టుగా మారింది. వరల్డ్‌కప్ తర్వాతే మా జోరు పెరిగింది. రాబోయే ప్రపంచకప్‌లోనూ నేను జట్టులో ఉండాలనుకుంటున్నా. అంతేకాదు భారత్‌ను నంబర్‌వన్‌గా చూడాలనేది నా కోరిక. 2005 వరల్డ్‌కప్‌లో మేం రన్నరప్ అయినప్పుడు జట్టు గురించి చాలా తక్కువమందికి తెలుసు" అని మిథాలీ తెలిపారు.
"అయితే 2017 ఇంగ్లాండ్‌లో జరిగిన ప్రపంచకప్ ఇందుకు పూర్తిగా భిన్నం. ఈ టోర్నీలోనూ రన్నరప్‌గా నిలిచినా.. తొలి మ్యాచ్ నుంచి ఫైనల్ వరకు మా మ్యాచ్‌లకు ఎంతో ఆదరణ లభించింది" అని మిథాలీ అన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications