For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మిథాలీకి చోటు: రామన్ కోచ్‌గా కివీస్ పర్యటనకు వెళ్లే భారత జట్టు ఇదే

Mithali Raj named in India’s T20I side for tour to New Zealand after WV Raman’s appointment as head coach

హైదరాబాద్: న్యూజిలాండ్ పర్యటన కోసం ప్రకటించిన టీ20 జట్టులో మిథాలీ రాజ్‌కి కూడా చోటు లభించింది. ఇటీవలే వెస్టిండిస్ వేదికగా జరిగిన ఐసీసీ మహిళల వరల్డ్ టీ20 సెమీస్‌ జట్టు నుంచి మిథాలీ రాజ్‌ను తప్పించడంపై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.

తాత్కాలిక కోచ్ రమేశ్ పొవార్, మిథాలీ రాజ్‌‌ల మధ్య చోటు చేసుకున్న వివాదంపై అభిమానులు మిథాలీకే మద్దతుగా నిలవడంపై బీసీసీఐ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. రమేశ్ పొవార్ పదవీ కాలాన్ని పొడిగించకుండా పొవార్ స్థానంలో కొత్త కోచ్ ఎంపిక చేసింది.

టీమిండియా మాజీ ఆటగాడు డబ్ల్యువి రామన్‌ని మహిళల జట్టుకు హెడ్ కోచ్‌గా నియమిస్తూ గురువారం బీసీసీఐ అధికారిక ప్రకటించింది. టీ20 కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, వైస్‌కెప్టెన్‌ స్మృతి మంధాన మద్దతు లభించినప్పటికీ వివాదాస్పద మాజీ కోచ్‌ రమేశ్‌ పొవార్‌కు నిరాశ తప్పలేదు.

53 ఏళ్ల రామన్‌ ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్‌ అకాడమీలో బ్యాటింగ్‌ సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. అంతర్జాతీయ జట్టుకు కోచ్‌గా పనిచేసిన అనుభవం లేదు. అయితే, రంజీ ట్రోఫీలో తమిళనాడు, బెంగాల్‌ లాంటి పెద్ద జట్లకు కోచ్‌గా పని చేసిన అనుభవం మాత్రం ఉంది.

డబ్ల్యువి రామన్‌ రాకతో మిథాలీరాజ్ ఎంపికపై ఆసక్తి నెలకొంది. అయితే, న్యూజిలాండ్ పర్యటనకు వన్డే జట్టు కెప్టెన్‌గా మిథాలీ రాజ్‌ను... టీ20 జట్టు కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్‌నే నియమించింది. ఐసీసీ మహిళల ఛాంపియన్‌షిప్‌లో భాగంగా న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది.

ఈ మూడు వన్డేల సిరిస్ జనవరి 24నుంచి ప్రారంభం కానుంది. 15మంది సభ్యులతో శుక్రవారం ప్రకటించిన జట్టులో సీనియర్ బ్యాట్స్‌ఉమెన్ వేదా కృష్ణమూర్తికి అటు వన్డేలతోపాటు ఇటు టీ20ల్లో సైతం చోటు దక్కలేదు.

న్యూజిలాండ్ పర్యటనకు వన్డే జట్టు: మిథాలీ రాజ్ (కెప్టెన్), పూనమ్ రౌత్, స్మృతి మందాన, జెమిమ రోడ్రిగ్స్, హర్మాన్ప్రీత్ కౌర్, దీప్తి శర్మ, తాన్య భాటియా (వికె), మోనా మెష్రం, ఏక్తా బిస్ట్, మన్సి జోషి, దలాలన్ హేమలత, పూనమ్ యాదవ్, రాజేశ్వరి గయక్వాడ్, జులన్ గోస్వామి , శిఖా పాండే.

న్యూజిలాండ్ పర్యటనకు టి20 జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మందాన (వైస్ కెప్టెన్), మిథాలి రాజ్, దీప్తి శర్మ, జెమిమ రోడ్రిగ్స్, అనూజా పాటిల్, దలాలన్ హేమలత, మన్సి జోషి, షికా పాండే, తాన్య భాటియా, పూనమ్ యాదవ్, ఏక్తా బిస్ట్, రాధా యాదవ్ , అరుంధతీ రెడ్డి, ప్రియా పునియా.

Story first published: Friday, December 21, 2018, 20:16 [IST]
Other articles published on Dec 21, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+