హైదరాబాద్: ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ క్వాలిఫయిర్స్ టోర్నీలో 14మందితో కూడిన భారత మహిళల జట్టుకు హైదరాబాద్‌కు చెందిన మిథాలీ రాజ్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు బీసీసీఐ మంగళవారం తన ట్విట్టర్‌లో అధికారిక ప్రకటన చేసింది.
శ్రీలంక రాజధాని కొలంబోలో ఫిబ్రవరి 3 నుంచి 21 వరకు ఈ క్వాలిఫయిర్స్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇటీవలే బ్యాంకాక్‌లో జరిగిన ఆసియా కప్ టీ20 టోర్నీని కైవసం చేసుకున్న మహిళల జట్టు వరుస విజయాలను సొంతం చేసుకుంది.

ఇక జట్టులో కీలకమైన క్రీడాకారిణిలుగా ఉన్న హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధన ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్‌లో అద్భుతమైన ఫామ్‌ని కనబరుస్తున్నారు. రాబోయే రోజుల్లో భారత మహిళల జట్టు ఆడనున్న అతిపెద్ద టోర్నీ వరల్డ్ కప్ క్వాలిఫయిర్సే.
గ్రూప్ ఏలో శ్రీలంక, ఐర్లాండ్, జింబాబ్వే, థాయిలాండ్ జట్లు ఉన్నాయి. ఇక గ్రూప్ బీలో ఇండియా, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, బంగ్లాదేశ్, స్కాట్ లాండ్, పీఎన్జీలు ఉన్నాయి. ఫిబ్రవరి 7వ తేదీన వార్మప్ మ్యాచ్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. కాగా ఈ క్వాలిఫయిర్ టోర్నీలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు ఐసీసీ మహిళల వరల్డ్ కప్-2017లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, వెస్టిండీస్‌తో కలిసి ఆడతాయి.
భారత మహిళల జట్టు:
మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధన, తిరుష్ కామిని, వేదా కృష్ణమూర్తి, దేవికా వైద్య, సుష్మ వర్మ (వికెట్ కీపర్), ఝలన్ గోస్వామి, శిఖ పాండె, సుకన్య పరీదా, పూనమ్ యాదవ్, ఏక్తాబిస్త్, రాజేశ్వరి గైక్వాడ్, దీప్తి శర్మ.