వీధి బాలల ప్రపంచకప్ అంబాసిడర్‌గా 'మిథాలీ రాజ్'

వీధి బాలల క్రికెట్ ప్రపంచకప్‌లో పోటీపడే భారత జట్టుకు.. భారత మహిళల వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ అంబాసిడర్‌గా ఎంపికయ్యింది. మిథాలీతో పాటు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్తాన్ రాయల్స్ కూడా భారత జట్టుకు అంబాసిడర్లుగా ఉన్నారు. లార్డ్స్ మైదానంలో వీధి బాలల క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
అంబాసిడర్‌గా ఎంపికయిన మిథాలీ రాజ్ మాట్లాడుతూ... 'భారత జట్టుకు అంబాసిడర్‌గా ఎంపికయినందుకు ఆనందంగా ఉంది. పిల్లల జీవితాల్లో క్రీడలు ఎంత ముఖ్య పాత్ర పోషిస్తాయో ఓ అథ్లెట్‌గా నాకు బాగా తెలుసు. క్రీడలే వారికి అన్ని వర్గాల మద్దతు లభించేలా ఉపయోగపడుతాయి. ఈ ఆటలతో వీధి బాలల జీవితాలు మలుపు తిరుగుతాయి. లింగ భేదం లేకుండా బాలబాలికలు కలిసి ఈ టోర్నీలో మ్యాచ్‌లు ఆడనుండటం ఆసక్తికరం. ప్రపంచకప్ కోసం ఎదురుచూస్తున్నా' అని మిథాలీ చెప్పుకొచ్చారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications