Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్వదేశంలో ఇంగ్లాండ్ సిరిస్ తర్వాత మిథాలీ రాజ్ వీడ్కోలు!

Mithali Raj Who Will Soon Say Goodbye To Cricket | Oneindia Telugu
Mithali Raj may call it quits from T20 Internationals after home series against England

హైదరాబాద్: భారత మహిళల జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ త్వరలో అంతర్జాతీయ టీ20లకు గుడ్‌బై చెప్పనుందా అంటే అనుననే సమాధానం వినవస్తోంది. సొంతగడ్డపై ఇంగ్లాండ్‌తో మార్చి నెలలో మొదలయ్యే టీ20 సిరిస్ అనంతరం టీ20 క్రికెట్‌కు మిథాలీ వీడ్కోలు పలకనున్నట్లు తెలుస్తోంది. న్యూజిలాండ్‌తో వన్డే సిరిస్‌లో మెరుగైన ప్రదర్శన చేసిన మిథాలీ రాజ్‌కు టీ20ల్లో మెరుగైన రికార్డు లేదు. ప్రస్తుతం మిథాలీ రాజ్ మహిళల వన్డే జట్టుకు కెప్టెన్‍‌గా వ్యవహారిస్తున్నారు.

తొలి టీ20లో మిథాలీకి దక్కని చోటు

తొలి టీ20లో మిథాలీకి దక్కని చోటు

బుధవారం వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్ మహిళల జట్టుతో జరిగిన తొలి టీ20లో సైతం మిథాలీకి చోటు దక్కలేదు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా టీ20 వరల్డ్‌కప్ జరగనున్న నేపథ్యంలో కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌ కౌర్ యువ క్రికెటర్లకు ప్రాధాన్యమిస్తోంది. ఈ నేపథ్యంలో మిథాలీ రిజర్వ్ బెంచ్‌కు పరిమితమైంది.

స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగే సిరీస్ అనంతరం వీడ్కోలు

స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగే సిరీస్ అనంతరం వీడ్కోలు

దీంతో స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరిగే సిరీస్ ద్వారా మిథాలీకి గౌరవంగా వీడ్కోలు ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు బోర్డు సీనియర్ అధికారి తెలిపారు. "2020 టీ20 వరల్డ్ కప్‌కు హర్మన్‌ప్రీత్‌ జట్టును సిద్ధం చేసుకుంటుందన్న సంగతి మిథాలీ అర్థం చేసుకోగలదు. ఆ టోర్నీలో ఆమె ఆడకపోవచ్చు. మిథాలీ లాంటి దిగ్గజ క్రికెటర్‌కు ఘనంగా వీడ్కోలు పలకాలి" అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.

మిథాలీని తప్పించడంపై వివాదం

మిథాలీని తప్పించడంపై వివాదం

గతేడాది టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్‌ తుది జట్టులో మిథాలీని తప్పించడం వివాదంగా మారింది. చీఫ్ కోచ్ రమేశ్ పొవార్, సీవోఏ సభ్యురాలు డయానా ఎడుల్జీ తన క్రికెట్ కెరీర్‌కు పుల్‌స్టాప్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ మిథాలీ మీడియా వేదికగా విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయిన సంగతి తెలిసిందే.

Story first published: Thursday, February 7, 2019, 15:17 [IST]
Other articles published on Feb 7, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+