Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇండియా వర్సెస్ ఇంగ్లండ్: మహిళల క్రికెట్.. మిథాలీకే కేప్టెన్సీ

Mithali Raj to lead India Women’s team for ODI series against England Women

ముంబై: న్యూజీలాండ్ గడ్డపై వన్డే సీరిస్ ను కోల్పోయిన భారత మహిళల క్రికెట్ జట్టు ఇక మరో పోరాటానికి సిద్ధపడుతోంది. భారత పర్యటనకు రానున్న ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టుతో తలపడబోతోంది. ఇంగ్లండ్ తో ఆడబోయే మూడు వన్డే మ్యాచ్ సిరీస్ కు శనివారం సాయంత్రం భారత జట్టును ప్రకటించింది సెలెక్షన్ కమిటీ. భారత మహిళా క్రికెట్ టీమ్ కు మిథాలీ రాజ్ కేప్టెన్ గా వ్యవహరిస్తారు. దీనితో పాటు ఈ నెల 18వ తేదీన ఇంగ్లండ్ జట్టుతో ఆడబోయే బోర్డ్ ప్రెసిడెంట్ లెవెన్ టీమ్ ను కూడా ప్రకటించింది. బోర్డు ప్రెసిడెంట్ లెవెన్ టీమ్ కు స్మృతి మంధాన కేప్టెన్. జట్టు కూర్పు ఇలా ఉంది..

మహిళా క్రికెట్ జట్టు: మిథాలీ రాజ్ (కేప్టెన్), ఝులన్ గోస్వామి, స్మృతి మంధాన, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్ ప్రీత్ కౌర్, దీప్తీ శర్మ, తానియా భాటియా (వికెట్ కీపర్), ఆర్ కల్పన (వికెట్ కీపర్), మోనా మేశ్రమ్, ఏక్తా భిష్త్, రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్, శిఖా పాండే, మాన్సీ జోషీ, పూనమ్ రౌత్.

బోర్డు ప్రెసిడెంట్ లెవెన్ టీమ్: స్మృతి మంధాన (కేప్టెన్), వేదా కృష్ణమూర్తి, దేవికా వైద్య, ఎస్ మేఘన, భారతి ఫుల్మలి, కోమల్ జన్ జడ్, ఆర్ కల్పన, ప్రియా పునియా, హర్లీన్ డియోల్, రీమాలక్ష్మి ఎక్కా, మనాలి దక్షిణి, మిన్నూ మణి, తనూజా కన్వర్.

Story first published: Saturday, February 9, 2019, 19:49 [IST]
Other articles published on Feb 9, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+