కెప్టెన్‌గా మిథాలీ: ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు జట్టు ఎంపిక

హైదరాబాద్: ఐసీసీ మహిళా ఛాంపియన్ షిప్‌లో భాగంగా జరగనున్న వన్డే సిరీస్ మార్చిలో జరగనుంది. ఈ సిరీస్‌కు టీమిండియా మహిళా జట్టుకు కెప్టెన్‌గా మిథాలీ రాజ్ బాధ్యతలు తీసుకోనున్నారు. వైస్ కెప్టెన్‌గా హర్మన్ ప్రీత్ కౌర్ వ్యవహరించనున్నారు. సిరీస్‌లో భాగంగా జరగనున్న మూడు వన్డేలకు వడోదరా వేదిక కానుంది.
సఫారీ గడ్డపై వన్డే, టీ20 సిరీస్‌లను కైవసం చేసుకున్న భారత మహిళల జట్టు రెట్టించిన ఉత్సాహంతో ఆసీస్‌తో పోరుకు సిద్ధమౌతోంది. దక్షిణాఫ్రికా పర్యటనలో గాయపడిన స్టార్ బౌలర్ జులన్ గోస్వామి ఆసీస్‌తో వన్డే సిరీస్‌కు దూరమైంది.
ఈ వన్డే సిరీస్ ముక్కోణపు సిరీస్ నేపథ్యంలో సాగనుంది. ఆస్ట్రేలియా, భారత్‌తో పాటుగా ఆడనున్న మరో జట్టు వివరాలు తెలియాల్సి ఉంది.
మిథాలీ నేతృత్వంలో ఆడనున్న జట్టు ఇదే:
మిథాలీ రాజ్(కెప్టెన్), హర్మన్‌ప్రీత్ కౌర్(వైస్ కెప్టెన్) స్మృతి మంధాన, పూనమ్ రౌత్, వేద కృష్ణమూర్తి, రోడ్రిక్స్, మోనా మిశ్రం, సుష్మా వర్మ(వికెట్ కీపర్), రాజేశ్వరి గైక్వాడ్, శిఖా పాండే, సుకన్య పరిద, పూజ, దీప్తి శర్మ.
మ్యాచ్‌లు జరగనున్న తేదీలు:
Ist ODI: March 12
2nd ODI: March 15
3rd ODI: March 18
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications