
సచిన్‌తో పోల్చడం గౌరవంగా భావిస్తున్నా
'సచిన్‌తో పోల్చడం గౌరవంగా భావిస్తున్నా. అతను సాధించినదాంట్లో నేను సగం కూడా అందుకోలేదు. అయితే ఓ మహిళ క్రికెటర్‌గా అభిమానులు నన్ను ప్రత్యేకంగా గుర్తించాలని ఆశిస్తున్నా. ఓ పురుష క్రికెటర్‌తో నన్ను పోల్చకండి' అని మిథాలీ కోరింది.

అందుకే అలా రియాక్ట్ అయ్యానని
వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు అంతర్జాతీయ మీడియా ప్రతినిధులతో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో మీ ఫేవరెట్ పురుష క్రికెటర్ ఎవరని అడిగినందుకు ఇదే ప్రశ్నను వాళ్లను అడుగుతారా? అని మిథాలీ సీరియస్ అయిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆ ప్రశ్న సంబంధంలేనిదిగా అనిపించిందని, అందుకే అలా రియాక్ట్ అయ్యానని తెలిపింది.

సోషల్ మీడియాలో చురుగ్గా లేకపోవడం వల్లే
తాను మొదటి నుంచీ అలాగే ఉంటానని ఆమె స్పష్టంచేసింది. 2005 వరల్డ్‌కప్‌లోనూ తాము రన్నరప్‌గా నిలిచినా.. ఇప్పటిలాగా సోషల్ మీడియాలో చురుగ్గా లేకపోవడం వల్ల తగిన గుర్తింపు రాలేదని, ఇప్పుడొస్తున్న గుర్తింపుతో చాలా సంతోషంగా ఉందని మిథాలీ చెప్పింది.

సీఎం కేసీఆర్ కృషిని ప్రశంసించిన మిథాలీ
ఇక తాను బుక్స్ బాగా చదువుతానని, బ్యాటింగ్‌కు వెళ్లే ముందు ఒత్తిడికి గురి కాకుండా బుక్ రీడింగ్ బాగా ఉపయోగపడుతున్నదని ఆమె తెలిపింది. ఇదిలా ఉంటే తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చగా మార్చేందుకు సీఎం కేసీఆర్ చేస్తున్న కృషిని ఆమె ప్రశంసించారు. నాటిని ప్రతి మొక్కను సంరక్షించాలని పిలుపునిచ్చారు.

వరల్డ్ కప్ తర్వాత స్టార్లుగా మారిన మహిళా క్రికెటర్లు
మహిళల వరల్డ్ కప్‌లో భారత మహిళల జట్టు రన్నరప్‌గా నిలిచిన తర్వాత భారత్‌లో మహిళల క్రికెట్‌కు ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది. మహిళా క్రికెటర్లు సైతం ఇప్పుడు స్టార్లుగా మారారు. అభిమానులు వాళ్లతో సెల్ఫీలు దిగడానికి పోటీ పడుతున్నారు. ఈ కార్యక్రమంలో టూరిజం కార్యదర్శి బుర్రా వెంకటేశం, టీఎస్టీడీసీ చైర్మన్ పేర్వారం రాములు, శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డితో పాటు పలవురు ప్రముఖులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











