అత్యధిక వన్డేలకు నాయకత్వం: చరిత్ర సృష్టించిన మిథాలీ రాజ్
హైదరాబాద్: భారత మహిళ క్రికెటర్ మిథాలీ రాజ్ చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో అత్యధిక వన్డేలకు సారథ్య బాధ్యతలు చేపట్టిన క్రికెటర్‌గా అరుదైన ఘనత సాధించింది. ఇప్పటి వరకు 195 వన్డేలాడిన మిథాలీ రాజ్ 118 వన్డేలకు కెప్టెన్‌గా వ్యవహారించింది.
ఫలితంగా అంతర్జాతీయ మహిళల వన్డే క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన క్రీడాకారిణిగా మిథాలీ రాజ్ అరుదైన ఘనత సాధించింది. ఐసీసీ వన్డే ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ప్రస్తుతం మిథాలీరాజ్ నాయకత్వంలోని భారత మహిళల జట్టు శ్రీలంకలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే.
మిథాలీ రాజ్ అరుదైన ఘనత
ఈ పర్యటనలో భాగంగా ఆతిథ్య శ్రీలంకతో భారత జట్టు మూడు వన్డేలు, 5 టీ20ల సిరిస్ ఆడనుంది. ఇరు జట్ల మధ్య మంగళవారం తొలి వన్డే ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌కు కెప్టెన్‌గా నాయకత్వం వహించడంతో మిథాలీ రాజ్ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది.
చార్లెట్ ఎడ్వర్ట్స్ రికార్డుని అధిగమించిన మిథాలీ
ఇప్పటి వరకు ఈ రికార్డు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ చార్లెట్ ఎడ్వర్ట్స్ (117) పేరిట ఉంది. ఆస్ట్రేలియా మాజీ క్రీడాకారిణి బెలిందా క్లార్క్ (101) ఈ జాబితాలో మూడో స్థానంలో ఉంది. అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ ముగ్గురు మాత్రమే వందకు పైగా వన్డే మ్యాచ్‌లకు నాయకత్వం వహించారు.

నాలుగో స్థానంలో న్యూజిలాండ్ క్రికెటర్ సుజీ బేట్స్
మరోవైపు, న్యూజిలాండ్ క్రికెటర్ సుజీ బేట్స్ ప్రస్తుం 76 వన్డేలకు నాయకత్వం వహించి ఈ జాబితాలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. 2004లో మిథాలీ రాజ్ భారత మహిళా జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైంది. భారత మహిళల క్రికెట్ జట్టుకు పిన్న వయస్సులోనే కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న క్రికెటర్ కూడా మిథాలీనే.

భారత్ విజయ లక్ష్యం 99
ఇదిలా ఉంటే, శ్రీలంకతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్‌కు 99 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 35.1 ఓవర్లకే కుప్పకూలి కేవలం 98 పరుగులు మాత్రమే చేసింది. శ్రీలంక జట్టులో ఓపెనర్ జయంగణి (33) టాప్ స్కోరర్‌గా నిలిచింది. మిగాత ఎనిమిది మంది సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. భారత బౌలర్లు జోషి 3, గోస్వామి, పూనమ్ యాదవ్ చెరో రెండు, గైక్వాడ్, దీప్తి శర్మ, హేమలత తలో వికెట్ దక్కించుకున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications