Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Womens World Cup 2022: చ‌రిత్ర సృష్టించిన మిథాలీ రాజ్.. తొలి క్రీడాకారిణిగా రికార్డు

Mithali Raj holds the record for being the first woman cricketer to play in six ODI World Cups
ICC Womens World Cup 2022: IND VS PAK భారత్ శుభారంభం Pak చిత్తు | Oneindia Telugu

మౌంట్ మౌన్‌గనుయ్‌: టీమిండియా ఉమెన్స్ టీం కెప్టెన్‌ మిథాలీ రాజ్ చ‌రిత్ర సృష్టించింది. ఉమెన్స్ క్రికెట్‌లో అత్య‌ధిక వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లు ఆడిన క్రీడాకారిణిగా రికార్డు నెల‌కొల్పింది. తాజాగా న్యూజిలాండ్ వేదిక‌గా జ‌ర‌గుతున్న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లోనూ ఆడ‌డం ద్వారా 39 ఏళ్ల మిథాలీ రాజ్ ఈ రికార్డును అందుకుంది.

ఆరు ప్ర‌పంచ‌క‌ప్‌లు ఆడిన క్రీడాకారిణి

ఆరు ప్ర‌పంచ‌క‌ప్‌లు ఆడిన క్రీడాకారిణి

అత్యంత అనుభ‌వ‌జ్ఞ‌రులైన మిథాలీ రాజ్‌కు ఇది ఆరో వ‌న్డే ప్ర‌పంచ‌కప్ కావ‌డం గ‌మ‌నార్హం. త‌ద్వారా ఆరు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లు ఆడిన తొలి ఉమెన్స్ క్రికెటర్‌గా మిథాలీ రాజ్ నిలిచింది. 2000వ సంవ‌త్స‌రంలో అంత‌ర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన మిథాలీ రాజ్‌ 2000, 2005, 2009, 2013, 2017తోపాటు తాజాగా జ‌రుగుతున్న 2022 వ‌న్డే ప్రపంచ కప్‌లోనూ ఆడుతోంది. కాగా ఈ ప్ర‌పంచ‌క‌ప్ త‌ర్వాత తాను క్రికెట్ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్టు మిథాలీ రాజ్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

అత్య‌ధిక ప‌రుగులు

అత్య‌ధిక ప‌రుగులు

ఆరు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ల‌లో 32 మ్యాచ్‌లు ఆడిన మిథాలీ రాజ్ 52 స‌గ‌టుతో 1148 ప‌రుగులు చేసింది. ఇందులో రెండు సెంచ‌రీలు, 9 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. ఈ క్ర‌మంలో ఉమెన్స్ క్రికెట్‌లో వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన భారత క్రీడాకారిణిగా మిథాలీ రాజ్ నిలిచింది. కాగా ఆదివారం పాకిస్థాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో మిథాలీ రాజ్ నిరాశపరిచింది. ఈ మ్యాచ్‌లో 36 బంతులు ఎదుర్కొన్న మిథాలీ 9 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఔటైంది.

మిథాలీ రాజ్ రికార్డులు

మిథాలీ రాజ్ రికార్డులు

అంత‌ర్జాతీయ క్రికెట్‌లో 12 మ్యాచ్‌లు ఆడిన మిథాలీ రాజ్ 43 స‌గటుతో 699 ప‌రుగులు చేసింది. ఇందులో ఒక సెంచ‌రీ, 4 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. ఇక 225 వ‌న్డే మ్యాచ్‌ల్లో 51 స‌గ‌టుతో 7623 ప‌రుగులు చేసింది. ఇందులో 7 సెంచ‌రీలు, 62 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. 89 టీ20 మ్యాచ్‌ల్లో 37 స‌గ‌టుతో 2364 ప‌రుగులు చేసింది. ఇందులో 17 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి.

అత్య‌ధిక ప‌రుగులు చేసిన స‌చిన్

అత్య‌ధిక ప‌రుగులు చేసిన స‌చిన్

మెన్స్ క్రికెట్‌లోనూ భార‌త బ్యాటింగ్ దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్ ఆరు వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ల‌ను ఆడాడు. ఈ క్ర‌మంలో మెన్స్ క్రికెట్‌లో అత్య‌ధిక ప్ర‌పంచ‌క‌ప్‌లు, అత్య‌ధిక ప‌రుగులు, ప్ర‌పంచ‌క‌ప్‌లో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన ఆట‌గాడిగా స‌చిన్ రికార్డు నెలకొల్పాడు. 1989లో అంత‌ర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన స‌చిన్ టెండూల్క‌ర్ 1992, 1996, 1999, 2003, 2007తోపాటు 2011 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ల‌లో ఆడాడు.

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ టోర్నమెంట్‌ల‌లో 2 వేల‌కు పైగా ప‌రుగులు చేసిన ఏకైక క్రికెటర్‌గా స‌చిన్‌ టెండూల్క‌ర్ నిలిచాడు. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ల‌లో 57 స‌గ‌టుతో స‌చిన్ టెండూల్క‌ర్ 2278 ప‌రుగులు చేశాడు. ఇందులో 6 సెంచ‌రీలు, 15 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి.

2011 ప్రపంచ‌క‌ప్‌లో స‌చిన్ అత్య‌ధిక రన్స్‌

2011 ప్రపంచ‌క‌ప్‌లో స‌చిన్ అత్య‌ధిక రన్స్‌

2011 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌ను టీమిండియా గెల‌వ‌డంలో స‌చిన్ టెండూల్క‌ర్ కీల‌క పాత్ర పోషించాడు. ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్ త‌ర‌ఫున అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా కూడా నిలిచాడు. ఈ ప్ర‌పంచ‌క‌ప్‌లో 53 స‌గ‌టుతో స‌చిన్ 482 ప‌రుగులు సాధించాడు. ఇందులో 2 సెంచ‌రీలు, 2 హాఫ్ సెంచ‌రీలు ఉన్నాయి. కాగా 2013లో సచిన్ టెండూల్క‌ర్ అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

Story first published: Sunday, March 6, 2022, 13:56 [IST]
Other articles published on Mar 6, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+