
న్యూ ఢిల్లీ: భారత మహిళా క్రికెటర్‌గా.. జట్టుకు కెప్టెన్‌గా నిలిచి ఎంతో మంది మహిళలు బాల్య దశనుంచే క్రికెట్ వైపు అడుగులేసేందుకు ప్రేరణ అయిన మిథాలీ రాజ్‌ను అపార్థం చేసుకున్నారు నెటిజన్లు. పంద్రాగష్టు పురస్కరించుకొని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో.. క్రీడారంగంలోని ప్రముఖులంతా తమ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అభిమానులకు శుభాకాంక్షలు పంపారు.
అయితే మిథాలీ రాజ్ మాత్రం ఇందులో ఆలస్యంగా స్పందించారు. 'ఎందరో వీరులు త్యాగం చేసి.. ఆకలి, పేదరికం, వివక్ష, సెక్సిజం, చీత్కారాల నుంచి మనల్ని కాపాడారు. మనల్ని మనంగా నిర్మించుకునే వెసలుబాటు కల్పించారు. వారి త్యాగాలను ఓ సారి స్మరించుకుంటూ వారందరికీ గౌరవ వందనం చేద్దాం. జైహింద్' అంటూ ట్వీట్ చేశారు. అలా తెలిపినప్పటికీ అప్పటికే అర్థరాత్రి అయిపోయిందని నోరు పారేసుకున్నాడు ఓ నెటిజన్. భారత మహిళా క్రికెటర్ మిథాలీరాజ్‌పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశాడు.
ఇందుకు కారణం ఆమె స్వాతంత్ర్య దినోత్సవం అయిపోయిన తర్వాత రోజు శుభాకాంక్షలు చెప్పడం. తాను ఎందుకు ఆలస్యంగా చెప్పాల్సి వచ్చిందో ఆ తర్వాత మిథాలీ వివరణ కూడా ఇచ్చింది. రాజకీయ, క్రీడా, సినీ ప్రముఖులందరూ సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కానీ, మిథాలీరాజ్ మాత్రం బుధవారం అర్ధరాత్రి తన ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపింది. దీంతో అభిమానులు స్వాతంత్ర్య దినోత్సవం అయిపోయాక శుభాకాంక్షలు చెబుతున్నావా. ఒక సెలబ్రెటీగా మీరు ఇలా చేయడం సరికాదు' అంటూ కామెంట్లు వర్షం కురిపించారు.
దీంతో కాస్త నిరాశ చెందిన మిథాలీ... 'నాకు సెలబ్రెటీ హోదా ఇవ్వడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. 1999 నుంచి నేను అథ్లెట్‌గా దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నాను. ప్రస్తుతం నేను ఛాలెంజర్స్ ట్రోఫీలో ఆడుతున్నాను. మైదానంలో ఉన్నంతసేపు మా వద్ద ఫోన్ ఉండదు. అలాగే టోర్నీ జరిగే సమయంలో నేను ఫోన్ వాడను. అందుకే ఆలస్యమైంది. నా కారణాన్ని ఒప్పుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తూ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు' అని మిథాలీ వివరణ ఇచ్చింది.