హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోకుండా: మిథాలీ రాజ్ ఫోటోషూట్
హైదరాబాద్: భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్‌గా 'మిథాలీ రాజ్' అందరికి పరిచయమే. ఇటీవల ఇంగ్లాండ్ వేదికగా జరిగిన వరల్డ్ కప్‌లో భారత జట్టుని ముందుండి నడిపించి అందరి మనసు దోచుకున్నారు. బుధవారం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ప్రకటించిన మహిళల ర్యాంకింగ్స్‌లో అగ్రస్ధానాన్ని కైవసం చేసుకున్నారు.

లేటెస్ట్ ఫోటోషూట్‌తో వార్తల్లో నిలిచిన మిథాలీ
అలాంటి మిథాలీ తాజాగా మరోక కారణంతో వార్తల్లో నిలిచారు. మిథాలీ రాజ్ ఇటీవలే ఓ లేటెస్ట్ ఫోటోషూట్‌కి ఫోజులు ఇచ్చారు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలను చూసిన వారంతా షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే హీరోయిన్‌లకు ఏ మాత్రం తీసిపోని గ్లామర్ ఒలకపోస్తూ బాట్ పట్టుకొని ఆమె ఫోటోలకు ఫోజులిచ్చారు.

మిథాలీ హీరోయిన్‌గా ట్రై చేస్తుందేమో
ఈ ఫోటోలను చూసిన వారంతా మిథాలీ రాజ్ హీరోయిన్‌గా ట్రై చేస్తుందేమో అని అంతా భావిస్తున్నారు. అయితే ఈ ఫొటో షూట్ చేసింది ఆమె హీరోయిన్ అయ్యేందుకు కాదని, ఓ యాడ్ కోసమని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆ మధ్య కాస్త గ్లామర్‌గా కనిపిస్తేనే నెటిజన్లు మిథాలీపై పెద్ద ఎత్తున విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

అనాడు అసలేం జరిగింది?
మిథాలీ తన స్నేహితులతో కలిసి దిగిన ఓ ఫొటోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. ఫొటోలో అందరి దుస్తులు బాగానే ఉన్నాయి కానీ మిథాలీ వేసుకున్న దుస్తులు చూసేందుకు కాస్త అసభ్యకరంగా ఉన్నాయి. ఈ ఫోటోను చూసిన నెటిజన్లకు ఇది ఎంత మాత్రం నచ్చలేదు. దీంతో నెటిజన్లు మాత్రం ఫోటోలో మిథాలి డ్రెస్స్ బాలేదని, ఫోటోను తొలిగించాలని సూచించారు. 'డిలీట్ చేయండి మేడమ్. మిమ్మల్ని ఎందరో స్ఫూర్తిగా తీసుకుంటారు.కానీ మీరు వేసుకున్న దుస్తులు బాలేవు' అంటూ ఓ నెటిజన్ స్పందించాడు. మరో నెటిజన్ 'నువ్వు మహిళల టీమిండియా కెప్టెన్‌వి. సినిమా సెలబ్రిటీవి కావు. ఈ ఫొటో డిలీట్ చేసెయ్' అంటూ ఘాటుగా స్పందించాడు.
'మీ నుంచి ఇలాంటివి వూహించలేదు. మీపై మీకు ఎలాగో గౌరవం లేదు. కనీసం అభిమానులకు మీపై ఉన్న గౌరవాన్నైనా నిలబెట్టుకోండి' అని మరొక నెటిజన్ స్పందించగా... ఇక్కడి ప్రజల గురించి తెలిసి కూడా అలాంటి ఫోటోను షేర్ చేయడం ఏమిటని అప్పట్లో ప్రశ్నించారు.

వోగ్ కవర్ పేజిపై కూడా
మిథాలీ రాజ్ ప్రముఖ మ్యాగజైన్ వోగ్ కవర్ పేజిపై దర్శనమిచ్చింది. వోగ్ మ్యాగజైన్ తన పదో వార్షికోత్సవ సందర్భంగా విడుదల చేసిన మ్యాగజైన్ కవర్ పేజిపై బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్, రిలయన్స్ ఫౌండేషన్ చైర్ ఫర్సన్ నీతా అంబానీతో కలిసి మిథాలీ రాజ్ దర్శనమచ్చింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications