Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అరుదైన గౌరవం: బీబీసీ శక్తిమంతమైన మహిళల్లో మిథాలీ

హైదరాబాద్: భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ మిథాలీరాజ్‌కు మరో అరుదైన గౌరవం దక్కింది. 2017 సంవత్సరానికి గాను బీబీసీ రూపొందించిన అత్యంత శక్తిమంతమైన భారత మహిళల జాబితాలో మిథాలీ రాజ్‌‌కు చోటు దక్కింది. బీబీసీ ఈ ఏడాదికి గాను ప్రపంచంలో అత్యంత స్ఫూర్తిదాయక, ప్రభావశీలురైన టాప్ 100 మహిళల జాబితాను విడుదల చేసింది.

భారత్ నుంచి మొత్తం ఏడుగురు

భారత్ నుంచి మొత్తం ఏడుగురు

ఇంజినీరింగ్ నుంచి క్రియేటివ్ ఇండస్ట్రీస్, క్రీడల నుంచి వ్యాపారం వరకు ప్రపంచవ్యాప్తంగా మహిళల సామర్థ్యాన్ని వారి నైపుణ్యాలను బట్టి బీబీసీ ఈ జాబితాను రూపొందించింది. ఇందులో భారత్ నుంచి వివిధ రంగాలకు చెందిన ఏడుగురు మహిళలకు చోటు దక్కింది.

బీబీసీ 100 విమెన్‌ చాలెంజ్‌ పేరుతో

బీబీసీ 100 విమెన్‌ చాలెంజ్‌ పేరుతో

ఇందులో మిథాలీ రాజ్ ఒకరు. ఈ జాబితాలో భారత్ నుంచి మిథాలీతోపాటు ఇరా త్రివేది, తులికా కిరణ్, అదితి అవాస్తి, మెహరూన్నిసా సిద్దిఖి, డాక్టర్ ఊర్వశి సాహ్ని, నిత్య తుమ్మలశెట్టి ఉన్నారు. అక్టోబర్ నెలలో ‘బీబీసీ 100 విమెన్‌ చాలెంజ్‌' పేరుతో భారత్‌లోని వివిధ నగరాల్లో అవగాహన కార్యక్రమాలు జరుగనున్నాయి.

అంచనాలు లేకుండా వరల్డ్ ఫైనల్‌కు

అంచనాలు లేకుండా వరల్డ్ ఫైనల్‌కు

ఈ ఏడాది ఎలాంటి అంచనాలు లేకున్నా భారత మహిళల జట్టును వరల్డ్ ఫైనల్ చేర్చింది. ఫైనల్లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు రన్నరప్‌గా నిలిచింది. దీంతో పాటు వన్డే చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన మహిళగా రికార్డు కూడా సృష్టించిన సంగతి తెలిసిందే.

ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు

ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు

మాంచెస్టర్‌ యునైటెడ్‌, ఇంగ్లండ్‌ మహిళా ఫుట్‌బాల్‌ జట్ల కెప్టెన్‌ కూడా జాబితాలో ఉన్నారు. 'ప్రపంచ మహిళా సామర్థ్యానికి వీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు' అని బీబీసీ తన ప్రకటనలో తెలిపింది. ‘జాబితాలో చోటు సంపాదించిన భారత మహిళలు తమ తమ రంగాల్లో చేస్తున్న కృషి ద్వారా ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు' అని పేర్కొంది.

Story first published: Monday, November 13, 2017, 12:17 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+